ఎంపీ సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన నమ్రత శిరోద్కర్!!

ఎంపీ సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన నమ్రత శిరోద్కర్ మహిళా దినోత్సవం నాడు మహిళలంతా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

ఈసారి మహిళా దినోత్సవం రోజున మహిళలంతా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని బిఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రాజకీయాలలో మాత్రమే కాకుండా, ప్రకృతి పరిరక్షణలో కీలకంగా వ్యవహరించే బిఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఈసారి కూడా సెలబ్రిటీలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ మొక్కలు పెట్టాలని సూచించారు.

ప్రకృతి పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్

ప్రకృతి పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్

రాష్ట్ర మంత్రులను, అధికారులను, సినీ సెలబ్రిటీలను ఇందులో భాగస్వామ్యం చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ప్రకృతి పరిరక్షణ కోసం మహిళలంతా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగినులు అందరూ మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవ నేపథ్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పోస్టర్ ను ఆవిష్కరించిన క్రమంలో ఆమె ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు.

ఎంపీ సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన నమ్రత

ఎంపీ సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన నమ్రత

మార్చి 8వ తేదీన మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎంవో కార్యదర్శి స్మిత సబర్వాల్, సీఎం ఓ ఎస్ డీ ప్రియాంక వర్గీస్ మహిళలకు సూచించారు. ఇదిలా ఉంటే మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన జోగినపల్లి సంతోష్ కుమార్ చాలెంజ్ కు సినీ నటి సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ స్పందించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ను తను స్వీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కు తనను నామినేట్ చేసినందుకు నమ్రత ఎంపీ సంతోష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.

నమ్రతకు ఎంపీ సంతోష్ కుమార్ ధన్యవాదాలు


మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ మొక్కలు నాటాలని కోరుతున్నాం అన్నారు నమ్రత. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న నమ్రత ఓ పోస్ట్ చేశారు. దీంతో జోగినపల్లి సంతోష్ కుమార్ నమ్రతా శిరోద్కర్ కు ధన్యవాదాలు తెలిపారు. మన చుట్టూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మించడానికి సహాయం చేయడం కోసం మహిళా దినోత్సవం సందర్భంగా ప్రచారం చేస్తున్నందుకు కృతజ్ఞతలు అంటూ ఆయన నమ్రత శిరోద్కర్ కు ధన్యవాదాలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+