• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాలకృష్ణ కంటే ముందే జూ.ఎన్టీఆర్‌కు నారా బ్రాహ్మణి సర్‌ప్రైజ్ గిఫ్ట్, భావోద్వేగం

|
    జూనియర్ ఎన్టీఆర్ కు నారా బ్రాహ్మణి సర్‌ప్రైజ్ బహుమతి

    హైదరాబాద్: నటుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రం ఘన విజయం సాధించింది. నాన్ బాహుబలి చిత్రాల రికార్డులను కొల్లగొట్టింది. ఈ సినిమా సక్సెస్ మీట్‌కు ఎన్టీఆర్ బాబాయి, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ వేడుకకు హాజరైన బాలయ్య మాట్లాడి అభిమానులను అలరించారు.

    సినిమాకు బాబాయి ఆశీస్సులు అందించినందుకు జూనియర్ ఎన్టీఆర్ థ్యాంక్స్ చెప్పారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి బాలయ్య రావడం ద్వారా అబ్బాయ్‌కు ఓ గిఫ్ట్ ఇచ్చారు. కానీ అంతకంటే ముందే, జూ.ఎన్టీఆర్ సోదరి అయిన, బాలకృష్ణ కూతురు అయిన నారా బ్రాహ్మణి ఓ సర్‌ప్రైజ్ బహుమతి ఇచ్చారు. జూ.ఎన్టీఆర్‌కు ఈ బహుమతిని పంపించారు.

    Nara Brahmani surprising Gift To Jr.NTR

    సోదరి నారా బ్రాహ్మణి పంపించిన గిఫ్ట్ చూసిన జూ.ఎన్టీఆర్ ఉద్వేగానికి లోనయ్యారు ఇటీవల అరవింత సమేత సినిమా చూసిన ఆమె ఎన్టీఆర్ పైన ప్రశంసలు కురిపించారు. విజయదశమి రోజున తన అన్న ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు చెబుతూ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను బ్రాహ్మణి పంపించారు. ఆ గిఫ్ట్‌కు జూనియర్ థ్యాంక్స్ చెప్పారని తెలుస్తోంది.

    ఆమె పంపించిన ఆ గిఫ్ట్.. హరికృష్ణ ఆల్బమ్. హరికృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. తన పెదనాన్న పాత ఫోటోలను సేకరించిన నారా బ్రాహ్మణి వాటిని ఆల్బమ్‌గా చేసి సీడీ రూపంలో జూనియర్‌కు పంపించారు. దీనిని చూసి ఆయన ఉద్వేగానికి లోనయ్యారట.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    English summary
    Nara Lokesh's wife Nara Brahmani, daughter of Balayya, who witnessed the film, praised her elder brother Tarak. also sent surprising gift on account of dasara.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more