నవీన్ హత్యకేసు: మర్డర్ డే.. కూల్ గా హరిహర; పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు!!

నవీన్ హత్య కేసు విచారణలో పోలీసులు షాకింగ్ విషయాలను తెలుసుకున్నారు. నవీన్ హత్య జరిగిన రోజు నవీన్, హరిహర కృష్ణ కలిసి ఎక్కడికి వెళ్ళారు? ఏం చేశారు? అన్నది పోలీసులకు విస్మయం కలిగించింది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన నవీన్ హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసుల దర్యాప్తులో ఊహించని షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. నవీన్ హత్య జరిగిన నాడు అసలు హరి హరికృష్ణ ఏం చేశాడు? వారిద్దరు ఎక్కడ కలిశారు? ఎక్కడెక్కడ తిరిగారు? చివరికి నవీన్ ను ఏ విధంగా హత మార్చాడు? వంటి అనేక ప్రశ్నలకు పోలీసుల లోతైన దర్యాప్తులో విస్తు గొలిపే విషయాలు బయటకు వచ్చాయి.

నవీన్ హత్య జరిగిన రోజు నవీన్, హరిహర కృష్ణ కలిసి ..

నవీన్ హత్య జరిగిన రోజు నవీన్, హరిహర కృష్ణ కలిసి ..


ఫిబ్రవరి 17వ తారీకు ఉదయం 9 గంటలకు హరిహర కృష్ణకు ఫోన్ చేసిన నవీన్ హైదరాబాద్ కు వస్తున్నట్టుగా తెలిపాడు. ఆపై హరి హర కృష్ణ నగరంలోని ఓ మిత్రుడికి ఫోన్ చేసి ఇద్దరూ కలిసి ఓ హాలీవుడ్ సినిమాకి వెళ్లారు. అనంతరం నాగోల్ లో ఉన్న ఒక రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేసేందుకు సిద్ధమైన సమయంలో నవీన్ నుంచి హరిహర కృష్ణకు ఫోన్ వచ్చింది. నవీన్ తాను ఎల్బీనగర్ లో ఉన్నట్టు చెప్పాడు. దీంతో మళ్లీ ఇద్దరు మిత్రులు కలిసి నవీన్ వద్దకు వెళ్లి, నవీన్ ని కూడా తీసుకువచ్చి నాగోల్ లో రెస్టారెంట్లో భోజనం చేశారు.

హత్య రోజు స్నేహితురాలికి మొబైల్ ఫోన్ కొనిచ్చిన హరిహర కృష్ణ

హత్య రోజు స్నేహితురాలికి మొబైల్ ఫోన్ కొనిచ్చిన హరిహర కృష్ణ

ఆ తర్వాత నవీన్ ని తీసుకుని హరి హరికృష్ణ ముసారాంబాగ్ లోని తన సోదరి ఇంటికి వెళ్ళాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా హరి హర కృష్ణకు ఒక స్నేహితురాలు ఫోన్ చేసింది. సెల్ ఫోన్ కొనడానికి హెల్ప్ చేయమని అడిగింది. దీంతో సాయంత్రం ఐదు గంటలకు నవీన్, హరి హర కృష్ణ ఇద్దరు చైతన్యపురిలోని మొబైల్ దుకాణానికి వెళ్లారు. స్నేహితురాలు ఫోన్ కొనుక్కోవడం కోసం మరికొంత డబ్బు కావాలని అడగడంతో లోన్ యాప్ లో 14000, పేటీఎం పోస్ట్ పెయిడ్ లో 4000 రుణం తీసుకొని స్నేహితురాలికి ఇచ్చాడు హరిహర కృష్ణ. మొత్తం 30 వేల రూపాయల విలువైన మొబైల్ ఫోన్ ను కొనుగోలు చేసుకుని ఆ స్నేహితురాలు వెళ్ళిపోయింది.

మద్యం తాగించి ప్రియురాలితో మాట్లాడించి .. ఆపై

మద్యం తాగించి ప్రియురాలితో మాట్లాడించి .. ఆపై


ఆ తర్వాత ఇద్దరు మళ్లీ ఇంటికి చేరుకున్నారు. ఆపై తాను ఎంజీ వర్సిటీ హాస్టల్ కు వెళతానని నవీన్ చెప్పగా తానే వచ్చి హాస్టల్ వద్ద దిగబెడతానని నవీన్ తో పాటు హరిహర కృష్ణ కూడా బయలుదేరాడు. నవీన్ తో పాటు బయలుదేరిన సమయంలోనే కత్తి, చేతి గ్లౌజులు పెట్టిన బ్యాగ్ ను తనతో పాటు తీసుకువెళ్లాడు. ఇక అక్కడి నుండి మార్గ మధ్యలో పెద్ద అంబర్ పేటకు చేరుకోగానే నవీన్ తో మద్యం తాగించాడు. ఇక ఇద్దరు కలిసి రాత్రి 11:30 సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు దాటిన తర్వాత నవీన్ ప్రేమించిన నిహారిక రెడ్డి తో మాట్లాడమని హరిహర ఫోన్ చేసి నవీన్ కు ఇచ్చాడు. ఆ తర్వాత నవీన్ ప్రియురాలికి సంబంధించిన రహస్యం ఒకటి చెబుతాను అంటూ నిర్మానుషంగా ఉన్న ఒక ప్రదేశానికి తీసుకువెళ్లాడు.

పక్కా ప్లాన్ .. నమ్మకంగా నటించి.. దారుణ హత్య

పక్కా ప్లాన్ .. నమ్మకంగా నటించి.. దారుణ హత్య

అక్కడ నవీన్ ను అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ మొత్తం ఎపిసోడ్లో హత్య చేయాలని ముందే ప్లాన్ చేసుకున్న హరిహర కృష్ణ అందుకు కావలసిన సరంజామాను ముందే సిద్ధం చేసుకున్నాడు. ఆరోజు హత్య చేయాలని ప్లాన్ చేసుకుని కూడా సినిమాకు వెళ్లొచ్చాడు. స్నేహితులతో తిరిగి వచ్చాడు. మరొక స్నేహితురాలికి మొబైల్ ఫోన్ కొనిచ్చాడు. నవీన్ కు ఎటువంటి అనుమానం రాకుండా నమ్మకంగా నటించాడు. ఏ మాత్రం భయము బెరుకు లేకుండా సినీ ఫక్కీలో దారుణంగా హతమార్చాడు. ఇక ఈ విషయాలు పోలీసులను షాక్ కు గురిచేశాయి. హత్య చేసిన రోజు చేస్తా అని ఫిక్స్ అయ్యాక కూడా హరిహర కృష్ణ అలా ఎలా ఉండగలిగాడు అన్నది ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురి చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+