నేరేళ్ళ ఘటన: సిసిఎస్ ఎస్ఐ రవీందర్‌పై కేసు నమోదు

Posted By:
Subscribe to Oneindia Telugu

సిరిసిల్ల: సిరిసిల్ల సిసిఎస్ ఎస్ఐ రవీందర్‌పై సిరిసిల్ల పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.నేరేళ్ళ ఘటనలో దళితులను సిసిఎస్ ఎస్ఐ రవీందర్‌ టార్చర్ చేశారనే ఆరోపణలతో ఆయనను విధుల నుండి తప్పించారు. హైకోర్టు ఆదేశం మేరకు తాజాగా ఎస్ఐ రవీందర్‌పై కేసు నమోదు చేశారు.

సిరిసిల్ల జిల్లాలోని నేరేళ్ళ ఘటనలో దళితులను టార్చర్ చేశారనే ఘటనపై సిసిఎస్ ఎస్ఐ రవీందర్‌‌‌పై విచారణ జరిపి ఆయనను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై డిఐజీ రవివర్మ నివేదిక ఆధారంగా రవీందర్‌పై సస్పెన్షన్ వేటు పడింది.

Nerella case: Siricilla SI charged with criminal case

నేరేళ్ళ ఘటనకు బాధ్యుడిగా రవీందర్‌ను భావిస్తూ తంగళ్ళపల్లి పోలీస్‌స్టేషన్‌లో సిసిఎస్ ఎస్ఐ రవీందర్‌పై కేసు నమోదైంది.గణేష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవీందర్‌పై కేసు నమోదైంది.

నేరేళ్ళ ఘటనపై సిరిసిల్ల ఎస్‌పి విశ్వజిత్‌పై దళితులు, బిసిలు ఫిర్యాదులు చేశారు. ఎస్‌పితో పాటు వేములవాడ డిఎస్‌పితో పాటు మరో 18 పోలీస్ అధికారులపై నేరేళ్ళ బాధితులు ఫిర్యాదు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Sircilla police booked a criminal case against the Sircilla CCS SI B. Ravinder in connection with the ‘Nerella’ incident by responding to the High Court which asked the police what steps they have taken against the accused in the incident of police torturing Dalits in Nerella.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి