Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అలా వైకుంఠపురంలో సీన్ రీపిట్.. పురిట్లోనే శిశువుల తారుమారు..!

మీరు అలా వైకుంఠపురంలో(ala vaikunthapurramuloo) సినిమా చూసే ఉంటారు. ఈ మూవీలో మురళీ శర్మ తనకు పుట్టిన బాలుడిని తన యజమాని భార్య టబ్ కొడుకుని తారుమారు చేస్తాడు. దీంతో టాబ్ మురళి శర్మ కుమారుడినే తన కొడుకుగా పెంచుతుంది. కానీ సినిమా ఇంటర్వెల్ సమయంలో అస్సలు నిజం తెలుస్తోంది. అన్ని మంచి శకునాలే మూవీలో కూడా పురిట్లోనే పిల్లను మారుస్తారు. పాత సినిమాల్లో కూడా ఇలాంటి సీన్లు చాలానే ఉన్నాయి. కానీ ఇదే నిజంగా జరిగితే..

అవును ఇది నిజంగా జరిగింది. పురిట్లోనే ఇద్దరు పిల్లలు తారుమారు అయ్యారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. జగిత్యాల మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇద్దురు నవజాత శిశువులు తారుమారు అయినట్లు తెలియడంతో ఈ విషయం చర్చనీయంశంగా మారింది. ఒకే సమయంలో పుట్టిన ఇద్దరు మగ శిశువులను తల్లుల వద్దకు తీసుకెళ్లారు సిబ్బంది. అయితే ఒకరి శిశువును మరొకరికి ఇచ్చారు. జిల్లాలోని బీర్పూర్ మండలం మంగేలా గ్రామానికి చెందిన ప్రసన్న పురిటి నొప్పులతో ఎంసిహెచ్ కి వచ్చారు.

New born babies were Changed in Jagityala district hospital

అదే సమయంలో మరో మహిళ కూడా ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చారు. దీంతో మహిళకు డాక్టర్లు ఇద్దరికీ ఒకే సమయంలో ప్రసవం చేశారు. పుట్టిన పిల్లల చేతికి ఉన్న ట్యాగ్స్ చూసుకోకుండా ఒకరి బేబీని మరొకరికి ఇచ్చారు. శిశువును తల్లిదండ్రులకు సిబ్బంది అప్పగించే సమయంలో వారు వారించారు. బేబీకి ఉన్న డ్రెస్, టవల్ తనది కాదని చెప్పారు. అయినా వినిపించుకోని సిబ్బంది.. మీ కొడుకే అంటూ అప్పగించారు. దీనిపై ఇరువురు తల్లిదండ్రులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

దీంతో తారుమారు అయినట్లు అంగీకరించినట్లు తెలిసింది.ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై బంధువులు అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ఆర్ఎంఓ నవీన్ ను సంప్రదించగా.. తారుమారైన మాట వాస్తవమేనని అన్నారు. అప్రమత్తమైన సిబ్బంది తిరిగి ఎవరి బిడ్డను వారికి అప్పగించారని వివరించారు. ఈ విషయం సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+