Happy new year 2024: హైదరాబాద్ తోపాటు తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సంబరాలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంవత్సరం 2024 వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ సంబరాలు జరిగాయి. డీజే సౌండ్స్ కు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 100కుపైగా ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.
గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో కలర్ ఫుల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. మరోవైపు, వైన్స్, బార్లు, ఫుల్ రష్ కొనసాగింది. బార్ అండ్ రెస్టారెంట్స్ రద్దీగా మారిపోయాయి. హైదరాబాద్ మహా నగరంలో ఎటు చూసినా న్యూఇయర్ సంబరాలు కనిపించాయి.

ఇది ఇలావుంటే, పోలీసులు హైదరాబాద్ నగర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవర్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు ఫ్లైఓవర్లపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇక తాగి వాహనాలు నడిపితే రూ. 10వేలతోపాటు ఆరు నెలల జైలు శిక్ష వేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అంతేగాక, రాత్రి ఒంటిగంట తర్వాత ఏ ఈవెంట్స్ నిర్వహించొద్దని పోలీసులు స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో ఐఏఎస్ సంస్థ నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.
— Congress for Telangana (@Congress4TS) December 31, 2023
Chief Minister Revanth Reddy attends the New Year celebration by the IAS organisation at Hyderabad.#RevanthReddy @revanth_anumula pic.twitter.com/2fPBTdCrK1
మరోవైపు, న్యూఇయర్ వేడుకల సందర్భంగా డ్రగ్స్ వినియోగంపైనా నిఘా పెట్టారు పోలీసులు. ఎక్సైజ్ పోలీసులు నగరంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. వాహనదారులను తనిఖీ చేశారు. జూబ్లీహిల్స్ లోని పలు పబ్‌లలో డ్రగ్స్ ఉన్నాయనే అనుమానంతో ఎక్సైజ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పలు చోట్ల మత్తు పదార్థాలను సీజ్ చేసిన పోలీసులు.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేని పబ్ లలో రాత్రి 10 గంటలకే సౌండ్ సిస్టమ్ ఆఫ్ చేయాలని ఆదేశించారు.
#WATCH | Hyderabad: Commissioner of Police Kothakota Srinivas Reddy welcomes the New Year by cutting a cake at Tank Bund Road. pic.twitter.com/r5GXc1l4tQ
— ANI (@ANI) December 31, 2023
ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ న్యూఇయర్ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి వంటి ప్రధాన నగరాల్లో న్యూఇయర్ వేడుకలు జరిగాయి. డీజేలు పెట్టి డ్యాన్సులు చేశారు. పలు చోట్ల సమూహిక కార్యక్రమాలు జరిగాయి. విశాఖ బీచ్‌లోనూ కొత్త ఏడాది వేడుకలకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చి ఎంజాయ్ చేశారు.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications