న్యూ ఇయర్ వేళ మందుబాబుల వీరంగం. ఫుల్ గా తాగి పోలీసులతో లొల్లి

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మందుబాబులకు కిక్క్ ఇస్తే పోలీసలకు మాత్రం చుక్కలు చూపించింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రాత్రి మందు బాబులు చేసిన రచ్చ పోలీసులకు తలనొప్పి తెప్పించింది. తప్ప తాగి చాలా చోట్ల పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు ఒక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1198 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడ్డారు

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. నిన్న రాత్రి నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ముందుగానే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. న్యూ ఇయర్ రోజు పట్టుబడితే భారీ జరిమానాలుంటాయని చెప్పినా.. మందేసి రొడ్డేక్కారు మందుబాబులు. దీంతో ప్రతి వాహనాన్ని ఆపి బ్రీత్ అనలైజర్ ద్వారా క్షుణ్ణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించిన పోలీసులకు పలు చోట్లు తప్ప తాగిన మందు బాబులు సినిమా చూపించారు

"మమ్మల్ని సేఫ్ గా ఇంటికి పంపండి.. మీకు బాధ్యత ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకున్నారు. అరగంట నుంచి ట్రై చేస్తున్నా ర్యాపిడో బుక్ కావట్లేదు. కారులో దిగబెట్టండి. లేదంటే రోడ్డుపై కూర్చుంటా అంటూ పోలీసులపై వాగ్వాదానికి దిగిన మందుబాబులు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఫుల్ గా తాగిన ఓ యువకుడు హయత్ నగర్ వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులకు దొరికాడు. అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా ఫుల్ గా మందేసినట్లు తేలింది. అయితే పోలీసులు తన బైక్ ను సీజ్ చేశారు. తాను ఇంటికి వెళ్లడానికి ర్యాపిడో బుక్ చేసుకోవడానికి ప్రయత్నించగా అవి బుక్ కాలేదు. దీంతో అతనికి చిర్రెత్తుకొచ్చింది.

New Year Drunk Driving Chaos in Hyderabad 1198 Cases Booked Videos Go Viral

డ్యూటీలో ఉన్న హయత్ నగర్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. నాకు ఇంటికి పంపించండి. మీరు సేఫ్ గా పంపిచండి మాకు. మీ కార్లలో పంపిస్తరా. అర్ధ గంట నుంచి ట్రై చేస్తున్నా ర్యాపిడో బుక్ కావట్లేదు. మీరు రెస్పాన్సిబిలిటీ ఉంది. బరాబర్ కూసుంటా. 100% కూసుంటా నేను. నేను తాగినా కదా. మీరు డ్రంక్ అండ్ డ్రేవ్ చేస్తుండ్రు. నేను మంచిగా ఇంటికి పోయేటోడినే. వీళ్లు వచ్చేసి నన్ను పట్టుకున్నరు.. అర్ధ గంట నుంచి ర్యాపిడో బుక్ చేస్తున్నా. నాకు ర్యాపిడో బుక్ కావట్లేదు.. నాకు పోలీసోళ్లు ఇంటికాడా డ్రాప్ చేయాలి. నన్న కార్లో డ్రాప్ చేయండి. లేకుంటే కారు ముందు కూర్చుంటా అంటా" వాదన పెట్టుకున్నాడు. పోలీసులు ఎంత వారించినో అతను తగ్గలేదు. ఊర్కో చిన్నా, డ్రాప్ చేస్తాంలో అంటూ పోలీసులు ఫ్రెండ్లీగా వ్యవహరించినా అతను మాత్రం పుష్ప స్టైల్లో అసలు తగ్గేదేలే అన్నట్లుగా పంతం పట్టాడు

వనస్థలిపురంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఒక వ్యక్తి నడిరోడ్డుపై పడుకుని హంగామా చేశాడు. పోలీసులు తనపై చేయి చేసుకున్నారని, తాను మద్యం సేవించలేదని ఆరోపిస్తూ హల్‌చల్ చేశాడు. అయితే ట్రాఫిక్ పోలీసులు ఈ ఆరోపణలను ఖండించి, సివిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకునేలోపే సదరు వ్యక్తి అక్కడి నుండి పరారయ్యాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+