హైదరాబాద్‌లో భూప్రకంపనలు అందుకే వచ్చాయి, ఆ శభ్దాలతో ఆందోళన వద్దు
హైదరాబాదులోని బోరబండ ప్రాంతంలో సంభవించిన భూప్రకంపనలపై నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) అధ్యయనం చేస్తోంది.
హైదరాబాద్: హైదరాబాదులోని బోరబండ ప్రాంతంలో సంభవించిన భూప్రకంపనలపై నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) అధ్యయనం చేస్తోంది.
బోరబండ, రహ్మత్ నగర్ సహా నాలుగు ప్రాంతాల్లో భూకంప పరిశీలన కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా బోరబండలో వచ్చిన భూప్రకంపనలతో ఎలాంటి ప్రమాదం లేదని ఎన్జీఆర్ఐ తేల్చింది.

చదవండి: హైదరాబాద్‌లో స్వల్ప భూ ప్రకంపనలు: జనం పరుగులు
భూమి లోపలి నుంచి భారీగా వస్తోన్న శబ్దాలతో ఆందోళన చెందవద్దని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. అవి స్వల్ప ప్రకంపనలు మాత్రమే అన్నారు. భూమి లోపల పొరల్లో జరుగుతున్న సర్దుబాటు వల్ల ఇలా జరుగుతోందని తెలిపారు.
బోరబండ సమీపంలో రెండు రోజుల పాటు సంభవించిన భూప్రకంపనలు స్థానికులను ఆందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications