హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌తో నీరవ్ మోడీ లింక్: గీతాంజలి షోరూంలపై ఈడి దాడులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

PNB Fraud : Nirav Modi, $ 1.6 Billion Fraud : CBI Alerts Interpol

హైదరాబాద్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్బీ) భారీ కుంభకోణం ప్రధాన సూత్రదారి నీరవ్ మోడీకి హైదరాబాదుతో ఉన్న సంబంధాలు కూడా వెలుగులోకి వచ్చాయి. హైదరాబాదులోని ఆస్తులు, షోరూంలు, ఆఫీసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అధికారులు సోదాలు చేస్తున్నారు.

హైదరాబాదులోని రావిరాలలో న్న జెమ్స్ పార్కుపై ఈడి దాడులు నిర్వహిస్తోంది. దానికితోడు నీరవ్ మోడీకి చెందిన గీతాంజలి షోరూంల్లో కూడా ఈడి అధికారులు సోదాలు నిర్వహి్తన్నారు.

ఇలా సోదాలు చేస్తున్నారు

ఇలా సోదాలు చేస్తున్నారు

ఇప్పటికే గీతాంజలి జెమ్స్ యజమాని మెహిల్‌పై ఈడి పిఎంఎల్ఎ కేసు నమోదు చేసింది. పిఎన్బీ కుంభకోణంలో మెహిల్‌ను ఈడి నిందితుడిగా చేర్చింది. ఆయన ఇంట్లో, ఆఫీసుల్లో కూడా సోదాలు నిర్వహిస్తోంది.

దశాబ్ద కాలంగా షోరూంలు

దశాబ్ద కాలంగా షోరూంలు

గత దశాబ్దకాలంగా గీతాంజలి జెమ్స్ పేరుతో నీరవ్ మోడీ వ్యాపారాలు చేస్తున్నారు. హైదరాబాదు, సూరత్, ముంబైల్లో గీతాంజలి షోరూంలు ఉన్నాయి. హైదరాబాదు దాడుల్లో ఈడి అధికారులు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాదులో కూడా..

హైదరాబాదులో కూడా..

సూరత్‌లోనే కాకుండా హైదరాబాదులో కూడా నీరవ్ మోడీ వజ్రాల తయారీ కేంద్రం ఉంది. హైదరాబాదులోని రావిరాల ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో నీరవ్ మోడీకి అప్టి ప్రభుత్వం భూమి కేటాయించింది. ఢిల్లీ, ముంబై, థానే ప్రాంతాల్లో కూడా నీరవ్ మోడీ షోరూంలపై ఈడి దాడులు చేస్తోంది.

దేశవ్యాప్తంగా విఐపి కస్టమర్లు

దేశవ్యాప్తంగా విఐపి కస్టమర్లు

నీరవ్ మోడీకి చెందిన షోరూంలను కూడా ఈడి సీజ్ చేస్తోంది. గీతాంజలి జెమ్స్‌కు దేశవ్యాప్తంగా విఐపి కస్టమర్లు ఉన్నారు. బ్యాంక్ అధికారులతో కుమ్మక్కయి నీరవ్ మోడీ దాదాపు రూ. 11,300 కోట్ల కుంభకోణానికి పాల్పడిన విష,యం తెలిసిందే. అయన ఇప్పటికే విదేశాలకు పారిపోయారు.

English summary
Enforcement Directorate (ED) is making searches at Nirav Modi's Gatanjali Show rooms and Ravirala Zems park in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X