కేసీఆర్‌తో స్టీఫెన్ సన్ ఫోటోలు: ఫాంహౌస్ వద్దకు మీడియాకు నో ఎంట్రీ
హైదరాబాద్: అల్లం సాగుపై దృష్టి సారించిన తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎరవలిలోని తన ఫాం హౌస్‌కు చేరుకున్నారు. గురువారం కూడా ఆయన రోజంతా అక్కడే గడిపారు.
అయితే తొలిరోజు ఓటుకు నోటు వ్యవహారంలో కీలక వ్యక్తి, తెలంగాణ నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఫాంహౌస్‌లో కేసీఆర్‌తో కలిసి తిరిగారు. ఈ ఫోటోలు దాదాపుగా అన్ని ప్రధాన పత్రికల్లో వచ్చాయి. దీంతో సీఎం కేసీఆర్‌పై విపక్షాలన్నీ విరుచుపడ్డాయి.
అంతేకాదు ఓటుకు నోటు కేసులో కీలక వ్యక్తికి కేసీఆర్ ఫాంహౌస్‌లో ఏం పని? అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశాయి. మరోవైపు బుధవారం ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తనను కలిసిన విషయం, ఫోటోలు పత్రికలలో రావడంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఆ ఫోటోలు ఎలా వచ్చాయి, మీడియాను లోపలికి ఎవరు రానిచ్చారని సిబ్బందిని ప్రశ్నించిన సీఎం ఫాంహౌస్ పరిసరాల్లోకి
మీడియాను అనుమతించవద్దని భద్రతా సిబ్బందికి సూచించారు. దీంతో పోలీసులు బందో బస్తు చర్యలు చేపట్టారు.
జర్నిలిస్టులు, కెమెరామెన్‌లను 2 కిలోమీటర్ల దూరంలోనే అడ్డుకుని వెనక్కి పంపించారు. సమీప గ్రామాల వారిని సైతం గుర్తింపు కార్డులను పరిశీలించాకే లోపలికి అనుమతించారు. కాగా, సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు వస్తున్న మినీ బస్ అసోసియేషన్ ప్రతినిధులను పోలీసులు మార్గం మధ్యలోనే అడ్డుకుని తిప్పి పంపించారు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..!












Click it and Unblock the Notifications