ఇక భరించలేను: అమెరికా అల్లుడి అరాచకంపై భార్య, బెడ్రూంలోను కెమెరాలు

ఓ అమెరికా అల్లుడు భార్యను వేధించడమే కాక, ఆమె పైన అనుమానంతో ఇంటి నిండా, చివరకు బెడ్రూంలోను సిసి కెమెరాలు పెట్టిన సంఘటన వెలుగు చూసింది.

హైదరాబాద్: ఓ అమెరికా అల్లుడు భార్యను వేధించడమే కాక, ఆమె పైన అనుమానంతో ఇంటి నిండా, చివరకు బెడ్రూంలోను సిసి కెమెరాలు పెట్టిన సంఘటన వెలుగు చూసింది. ఈ మేరకు బాధితురాలి తల్లిదండ్రులు సైబరాబాద్ రాచకొండ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఫోన్ ద్వారా తన బాధలను వెల్లడించారు.

బాధితురాలి పేరు శిరీష. ఆమె భర్త కీర్తి సాయి రెడ్డి. వీళ్లు వర్జీనియా బీచ్‌లో ఉంటున్నారు. బాధితురాలు తన బాధను ఫోన్ ద్వారా వెల్లడించారు.

NRI torcher to wife in America, Cameras in residence

హౌస్ అరెస్ట్

తన భర్త తనను హౌస్ అరెస్టు చేశాడని, తమకు ఆరు నెలల బాబు ఉన్నాడని, ఇప్పుడు మళ్లీ గర్భవతినని ఆమె తెలిపారు. ఇప్పుడు అబార్షన్ చేయించుకోమని చెబుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనను పలు విధాలుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడన్నారు.

అబార్షన్ వద్దని ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదన్నారు. తన భర్త తల్లి, అన్నయ్య మాటలు విని తనను వేధిస్తున్నారన్నారు. తనకు తెలియకుండా అబార్షన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తన పైన పలు విధాలుగా ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పారు.

అబార్షన్ చేయించుకోకుంటే ఆత్మహత్య

అబార్షన్ చేయించుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. డాక్టర్ వద్దకు తనను తీసుకు వెళ్లినప్పుడు స్పష్టంగా అబార్షన్ వద్దని చెప్పానని తెలిపారు. తన ఆరు నెలల బాబుకు పాలు కూడ ఇవ్వకుండా తీవ్రంగా హింసిస్తున్నారన్నారు.

బాబును దూరంగా ఉంచుతానని బెదిరిస్తున్నారన్నారు. తనను డాక్టరుకు చూపించడం లేదన్నారు. ఆహారం పెట్టడం లేదన్నారు. అమెరికా వచ్చిన మొదటి రోజు నుంచి తనను ఇలానే వేధిస్తున్నారని చెప్పారు.

బాబు కోసం భరించా.. ఇక భరించలేను

తన అత్త, బావ, మా ఆయన కలిసి తనను వేధిస్తున్నారని చెప్పారు. నా బాబు కోసం ఇన్నాళ్లు భరించానని, కష్టాలు అనుభవిస్తున్నానని, ఇక భరించలేనని ఆమె చెప్పారు. తనను దయచేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మా అల్లుడు వేధిస్తున్నాడు

నా బిడ్డను నా అల్లుడు ఇబ్బంది పెడుతున్నారని బాధితురాలు శిరీష తల్లి చెప్పారు. మా మనువడికి పాలు కూడా ఇవ్వడం లేదని, చిన్న బాబును తల్లి వద్ద ఉండటం లేదని, తన కూతురుకు భోజనం కూడా పెట్టడం లేదన్నారు. తన కూతురును తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.

'భర్త వేధిస్తున్నాడని, కత్తి తీసుకొని వస్తున్నాడని, చావాలో బతకాలో తెలియడం లేదని, ఏం చేయాలో చెప్పాలని' తన కూతురు కంటతడి పెడుతోందన్నారు. గతంలోను పలుమార్లు ఇబ్బంది పెట్టాడని చెప్పారు. రెండోసారి గర్భవతి అయ్యాక మళ్లీ ఇబ్బందులు పెడుతున్నారన్నారు.

సైబరాబాద్ రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశామని బాల హక్కుల పరిరక్షణ సమితి ప్రతినిధులు చెప్పారు. భర్తకు ఓ అవకాశమిస్తామని, అమెరికా పోలీసుల సాయంతో ఇక్కడి పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు. అత్తను అరెస్టు చేయిస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+