మెట్రో రైలులో మరదలు మైసమ్మ: ఏమిటిది అంటే..
హైదరాబాద్: హైదరాబాదు మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) ఎన్వీస్ రెడ్డి మంచి ఉత్సాహంతో ఉన్నట్లున్నారు. మెట్రో రైలు మొదటి దశను పూర్తి చేసి, నగరవాసులకు అందుబాటులోకి తేవడంతో ఆయన ప్రతిష్ట పెరిగింది.
Recommended Video

తనలోని కళాకారుడికి ఎన్వీఎస్ రెడ్డి పదును పెట్టారు. శుక్రవారం సికింద్రాబాదులోని కస్తూర్భా గాంధీ మహిళా జూనియర్ కళాశాల వార్షికోత్సం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్.రెడ్డి హాజరయ్యారు.

పాటలోనూ మెట్రో రైలే..
కళాశాల వార్షికోత్సవంలో ఆయన ‘మెట్రోరైలులో మరదలు మైసమ్మ.. ఏసీలో వచ్చే మరదలు మైసమ్మ.. చెమటలు పట్టేదిలేదు మరదలు మైసమ్మ'.. అంటూ పాటలు పాడి విద్యార్థినుల్లో ఉత్సాహం నింపారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు.

గ్లోబల్ సిటీగా హైదరాబాద్..
మెట్రోరైలు రావడంతో హైదరాబాదు గ్లోబల్ సిటీగా మారుతుందని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. 25 వేల కోట్ల రూపాయల వ్యయంతో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభమైందని, 50 వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వస్తాయని ఆయన చెప్పారు.

విద్యార్థినులకు ఉపదేశం
ఇంటర్మీడియట్ దశ ఎంతో కీలకమైందని, ఎన్ని కష్టాలు వచ్చినా శ్రద్ధగా చదివి అనుకున్న గమ్యాన్ని చేరాలని ఎన్వీఎస్ రెడ్డి విద్యార్థినులకు సూచించారు. కాలేజీ టాపర్స్‌కు ఆయన బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.

హైదరాబాద్ మెట్రో కీర్తి...
హైదరాబాద్ మెట్రో రైలు కీర్తి ఎన్వీఎస్ రెడ్డికి దక్కింది. గడువులోగా మెట్రో రైలును కూత పెట్టించడంలో అడ్డంకులను అధిగమించి ఆయన విజయం సాధించారు. రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టుపై ఆయన దృష్టి పెట్టారు.
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications