మంత్రి సీతక్కకు గ్రాండ్ వెల్కమ్; సీతక్క ట్వీట్; స్మితా సబర్వాల్ రీ ట్వీట్!!
తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ధనసరి అనసూయ అలియాస్ సీతక్క తన శాఖల పరిధిలో పనులపై సమీక్షలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో తాజాగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని తెలుసుకోవడం కోసం మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాలపై చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు.
ఇక ఈ సమీక్ష సమావేశానికి ఐఏఎస్ అధికారిణి, మిషన్ భగీరథ సిసి స్మిత సబర్వాల్ కూడా హాజరయ్యారు. సమీక్ష సమావేశం నిర్వహించడానికి వెళ్లిన సీతక్క కు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. కరతాళ ధ్వనులతో సీతక్కను వారంతా స్వాగతించారు. ఈ వీడియోను సీతక్క ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

ఈ మేరకు ట్వీట్ చేసిన సీతక్క "నా క్యాబినెట్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులను నన్ను మంత్రిగా కాకుండా సోదరిలాగా చూడాలని కోరాను, మా ముందు పెద్ద పని ఉంది, ప్రతి గ్రామంలో రోడ్లు మరియు తాగునీటి సౌకర్యాలు మా అత్యంత ప్రాధాన్యత. ఘన స్వాగతం పలికిన మీ అందరికీ ధన్యవాదాలు" అంటూ పేర్కొన్నారు.
I asked my cabinet department employees to treat me like their family member like sister not like a Minister we have a big task ahead, roads & drinking water facilities in every village it our most priority.
— Danasari Seethakka (@seethakkaMLA) December 15, 2023
Thank you all for the great welcome🙏 @SmitaSabharwal @revanth_anumula pic.twitter.com/xAVevN8orP
ఇక ఇదే సమయంలో మిషన్ భగీరథ పనులపై రివ్యూ నిర్వహించిన మంత్రి సీతక్క గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజు నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామానికి రోజువారి నీటి సరఫరా జరిగేలా చూడాలని శాఖ ఇంజనీర్లను కోరారు. వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవాలని, రిజర్వాయర్లు, నదులు తదితర నీటి వనరుల స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు.
మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాల గురించి స్మితా సబర్వాల్ మంత్రి సీతక్క కు వివరించారు. ఈ సమయంలోనే మేడారం జాతరపై త్వరలోనే వివిధ విభాగాలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ఇక మిషన్ భగీరథ పై రివ్యూ నిర్వహించిన సీతక్కకు ఉద్యోగులు పలికిన ఘనస్వాగతం వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సీతక్క. ఆ వీడియోను స్మిత సబర్వాల్ తిరిగి రీ ట్వీట్ చేశారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications