తాత వికృత చేష్టలు : యువతికి వేధింపులు, అడిగితే కర్రలతో దాడి, చాదర్‌ఘాట్‌లో ఘటన
హైదరాబాద్ : అతని వయస్సు 64 ఏళ్లు. కానీ బుద్ధి మాత్రం వక్రంగా ఉంది. తన మనమరాలి వయస్సున్న యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. ముసలోడి వేధింపులు భరించలేని యువతితో తల్లిదండ్రులతో చెప్పింది. ఇదేంటని నిలదీస్తే పరస్పరం రాళ్ల దాడి చేసేవరకు వెళ్లింది.
వేధింపుల పర్వం
చాదర్‌ఘాట్‌లో అబ్దుల్ అజీజ్ అనే వృద్ధుడు ఉంటున్నాడు. అతని పక్క ఇంట్లో 24 ఏళ్ల యువతి ఉంటుంది. వాస్తవానికి తన మనమరాలి వయస్సున యువతి అతగాడు బాగుండాలి. మంచిగా ప్రవర్తించాలి. కానీ ముసలోడు వక్రబుద్ధి చూపించాడు. ఎప్పుడూ ఆ యువతితో అనుచితంగా ప్రవర్తించేవాడు. అదీ, ఇదీ అని వేధించాడు. తన తాత వయస్సున అజీజ్ చేష్టలతో విసిగి వేసారిన యువతి .. చివరికి తన తల్లిదండ్రులకు వేధింపుల పర్వాన్ని వివరించింది.

అడిగితే దాడి ..
తమ కూతురుని అజీజ్ వేధిస్తున్న విషయాన్ని తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. వెంటనే అజీజ్‌ను పిలిచి అడిగారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. అసభ్యకరంగా ప్రవర్తించే గాక .. యువతి కుటుంబసభ్యులపై కర్రలతో దాడిచేశారు అజీజ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ క్రమంలో ఓ యువకుడిపై రాయితో దాడిచేయడంతో అతినికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో స్థానికులు అతనిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనిని పరీక్షిస్తున్నారు. బాధిత యువతి కుటుంబసభ్యులు .. అజీజ్ కుటుంబంపై ఫిర్యాదు చేశారు. వేధింపులు, దాడి రెండు కంప్లైంట్ చేశామని చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications