• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డిసెంబర్ 29న మ‌గాళ్ల‌కు అస‌లు టెన్ష‌న్..! టీవిల్లో కార్య‌క్ర‌మాలు బంద్..! భ‌ర్త‌ల పై భార్యల ఫోక‌స్..

|

హైద‌రాబాద్ : ముందుంది నూత‌న సంవ‌త్స‌ర పండుగ‌. కొత్త సంవ‌త్ప‌రానికి ఘ‌నంగా స్వాగ‌తం చెప్పాల‌నుకుంటారు టీనేజ‌ర్స్. అదే జోష్ లో తేలి తూగాల‌నుకుంటారు యువ‌త‌. అందుకు త‌గ్గ‌ట్టే పార్టీల‌కు, ప‌బ్బుల‌కు వారం ముందు నుండే ప‌క‌డ్బందీ ప్లాన్ చేసుకుంటారు యువ‌తీ యువ‌కులు. ఇక నూతన సంవ‌త్స‌ర ఘ‌డియ‌లు స‌మీపిస్తున్నాయంటే ప్రియ‌మైన వారికి, స్నేహితుల‌కు, బందువుల‌కు ఎలాంటి గ్రీటింగ్స్ సిద్దం చేయాలా అనే బిజీ లో ఉంటారు యువ‌త‌.

 టీవీలో వినోద భ‌రిత కార్య‌క్ర‌మాలు బంద్..! చిక్కుల్లో భ‌ర్త‌లు..! చిరాకులో భార్య‌లు..!

టీవీలో వినోద భ‌రిత కార్య‌క్ర‌మాలు బంద్..! చిక్కుల్లో భ‌ర్త‌లు..! చిరాకులో భార్య‌లు..!

ఏ కుర్ర‌కారును చూసినా ఏదో తెలియ‌ని ఉత్సాహం వారిని ఊపేస్తుంటుంది. ప‌ట్ల‌ణ ప్రాంత యువ‌త‌లో కొత్త సంవ‌త్స‌రం తాలూకా జోష్ కాస్త ఎక్కువ మోతాదులోనే క‌నిపిస్తుంటుంది. ఇక్క‌డి వ‌ర‌కు యూత్ క‌ధ బాగానే ఉన్నా కొత్త‌గా పెళైన వారు, ఒక‌రు, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్న భార్య‌భ‌ర్త‌లు కొత్త ఈ కొత్త సంవ‌త్స‌రాన్ని ఎలా స్వాగ‌తిస్తారు, అందుకోసం వారు ఏర్పాటు చేసుకుంటున్న కార్య‌క్ర‌మాలు ఎలా ఉంటాయి అనే అంశాలు ఆస‌క్తిగా ఉంటాయి.

 కొత్త సంవ‌త్స‌రం పేరుతో భ‌ర్త‌ల పార్టీలు..! భార్య‌లు భంగం క‌లిగించే అవ‌కాశం..!!

కొత్త సంవ‌త్స‌రం పేరుతో భ‌ర్త‌ల పార్టీలు..! భార్య‌లు భంగం క‌లిగించే అవ‌కాశం..!!

సాధార‌ణాంగా తెలుగింటి ఇల్లాలు భ‌ర్త ఇంట్లోనే ఉండి కుటుంబ స‌భ్యుల మ‌ద్య నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లు జ‌రుపుకోవాల‌ని కోరుకుంటారు, కాని మ‌న బాబాయ్ లు మాత్రం అందుకు స‌సేమిరా అంటుండ‌టం మ‌నం నిత్యం గ‌మినిస్తుంటాం. ఇక టీవీల్లో ర‌క‌ర‌కాల ఎంట‌ర్టెయిన్ మెంట్ కార్య‌క్ర‌మాలు వ‌స్తుంటాయి అవిచూసుకుంటూ మీరు ఎంజాయ్ చేయండి, కాస్త స్నేహితుల‌తో గ‌డిపి వ‌స్తాన‌ని భ‌ర్త‌లు తుర్రున పార్టీల‌కు వెళ్లిపోవ‌డం కూడా స‌ర్వ సాధార‌ణంగా చూస్తుంటాం..! ఇక్క‌డి వ‌ర‌కు క‌ధ రొటీన్ గా ఉన్నా అస‌లు స్టోరీ ఇక్క‌డే మొద‌లు కాబోతోంది.

 టీవీలో కార్య‌క్ర‌మాల‌కు బ్రేక్..! టెన్ష‌న్ ప‌డుతున్న భ‌ర్త‌లు..!!

టీవీలో కార్య‌క్ర‌మాల‌కు బ్రేక్..! టెన్ష‌న్ ప‌డుతున్న భ‌ర్త‌లు..!!

అర్ధ రాత్రి వ‌ర‌కు టీవి కార్య‌క్ర‌మాల‌తో బిజీ గా గ‌డిపే స‌గ‌టు భార్య‌లు భ‌ర్త‌లు ఎక్క‌డ ఎంజాయ్ చేసి ఎన్నింటికి ఇంటికి చేరుతార‌నే విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోరు. కాని ఇదే విష‌యంలో ఈ సారి పార్టీల‌కు ప్లాన్ చేసుకునే అంకుల్స్ కి టీవి కార్య‌క్ర‌మాలు శ‌రాఘాతం కాబోతున్నాయి. ఈ నెల 29న టీవిల్లో ఎంట‌ర్టెయిన్ మెంట్ కార్య‌క్ర‌మాల‌కు బ్రేక్ ప‌డుతుండ‌డంతో ఏమీ తోచ‌ని భార్య‌లు త‌మ త‌మ భ‌ర్త‌ల పై ఫోక‌స్ పెట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఎన్నింటికి ఇంటికి వ‌స్తారు, ఎక్క‌డ పార్టీ, ఎవ‌రెవ‌రు, నాకు బోర్ కొడుతోంది, త్వ‌రగా ఇంటికి రండి అంటూ నిమిషానికో ఫోన్ చేసి చుక్క‌లు చూపిస్తుంటారు. దీంతో ఇయ‌ర్ ఎండింగ్ పార్టీకి గ్రాండ్ ప్లాన్ చేసుకున్న భ‌ర్త‌లు భార్య‌ల ఫోన్ కాల్స్ తో బేజార‌వ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితులు నెల‌కొంటాయి.

 కొంప‌ముంచుతున్న టీవిలు..! ఎంట‌ర్టెయిన్ మెంట్ లేక పోతే ఎలా..?

కొంప‌ముంచుతున్న టీవిలు..! ఎంట‌ర్టెయిన్ మెంట్ లేక పోతే ఎలా..?

భార్య‌ల‌కు ఎదో చెప్పి ఎక్క‌డికో వెళ్లే చిలిపి భ‌ర్త‌లు కూగా టీవి కార్య‌క్ర‌మాలు ర‌ద్దవ్వ‌డంతో కాస్త ఇబ్బందికర ప‌రిస్థితులు ఎదుర్కొన‌క త‌ప్పేట్టు లేదు. టీవి కార్య‌క్ర‌మాలు ర‌ద్దైన‌ట్టు తెలియ‌ని అంకుల్స్ ఆరింటికే ఒంటినిండే డియోడ‌రెంట్ కొట్టుకుని బ‌య‌ట‌ప‌డి, ఆ త‌ర్వాత భార్య పెట్టే ఫోన్ న‌స ఎక్క‌డికి దారితీస్తుందో, ఎంత‌టి అన‌ర్ధాల‌కు కార‌ణ‌మ‌వుతుందో చెప్ప‌లేం. సీరియ‌ల్స్ లో జ‌రిగే వాయిలెన్స్ స‌న్నివేశాలు కూడా ప్ర‌త్య‌క్షంగా ఇళ్ల‌లో జ‌రిగే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఒక్క‌రోజే టీవీలో కార్య‌క్ర‌మాలు ర‌ద్దైతేనే ఇంత‌టి ఘోరాలు జ‌రిగితే ఇక నెల మొత్తం కార్య‌క్ర‌మాలు అనివార్యంగా ర‌ద్దైతే ప‌రిస్థితి ఏంట‌నేది అంతుచిక్క‌కుండా ఉంది. కాబ‌ట్టి భార్య క‌ళ్ల‌ని టీవికి క‌ట్టేసి కార్య‌క్ర‌మాలు నెట్టుకొచ్చే భ‌ర్త‌లూ... త‌స్మాత్ జాగ్ర‌త్త‌..!!

English summary
The average wives who are busy with TV shows for half a night do not care much about where their husbands enjoy and get home. But in this case, the party plans this time and the TV programs will be stoping. On the 29th of this month, the festive weddings seem to have a chance to focus on their husbands, as the televised entertainment programs are breaking down.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X