కొద్దిరోజుల్లో పెళ్లి: కొత్తపేట రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం, విలపిస్తున్న తల్లిదండ్రులు..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నగరంలోని కొత్తపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో ఖమ్మంకు చెందిన గీత అనే యువతి దుర్మరణం పాలైంది. మరో రెండు మూడు వారాల్లో ఆమె పెళ్లి ఉండటంతో.. షాపింగ్ కోసం హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది.

గీత దుర్మరణంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. కొత్తపేట చెన్నై షాపింగ్ మాల్ సమీపంలో రాత్రి 10.15గం. సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఘటనలో మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలైనట్టు సమాచారం. చెన్నై షాపింగ్ మాల్ లో షాపింగ్ అనంతరం.. అక్కడికి సమీపంలో ఉన్న యూటర్న్ వద్ద నుంచి మలుపు తిరుగుతుండగా.. ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.

one killed in road accident in kothapet, hyderabad

యూటర్న్ వద్ద ఎటువంటి సంకేతం లేకపోవడంతో.. అటుగా వెళ్లే వాహనాలు అది గమనించట్లేదు. దీంతో వేగంగా వస్తున్న వాహనాలు యూటర్న్ తీసుకునే వాహనాలను ఢీకొనే ప్రమాదం ఏర్పడిందంటున్నారు. ప్రమాదం అనంతరం యువతి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కూతురి దుర్మరణంతో గీత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Woman in twenties has died in a road accident on Friday night at Kothapeta, Hyderabad

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి