హైదరాబాద్ పోలీస్ 'ఆపరేషన్ ఆక్టోపస్'.. 16 రాష్ట్రాల్లో 100 మందికి పైగా అరెస్ట్..
తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు 'ఆపరేషన్ ఆక్టోపస్' పేరుతో భారీ ఆపరేషన్ నిర్వహించారు. 16 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి 104 మంది నిందితులను అరెస్టు చేసింది సైబర్ క్రైమ్ విభాగం. నిందితులుగా మ్యూల్ ఖాతాదారులు, సరఫరాదారులు, బ్యాంకు అధికారులు ఉన్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఫొటోలతో నేరాలకు పాల్పడుతున్నవాళ్లు, డిజిటల్ అరెస్ట్‌లతో పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాలు ఉన్నాయి. నిందితుల నుంచి పెద్ద ఎత్తున నగదు సీజ్ చేశారు. అలాగే 152 బ్యాంకు పాస్ పుస్తకాలు, 26 ల్యాప్ టాప్ లు, 204 సెల్ ఫోన్లు, 141 సిమ్ లను స్వాధీనం చేసుకున్నారు.
OPERATION OCTOPUS
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 24, 2026
Hyderabad Police dismantles Pan-India cyber fraud syndicate in a major crackdown
104 arrested across 16 States
Mule account holders, accounts suppliers, bank officials apprehended for complicity
₹36 Lakhs in Cash & 200+ Mobile Phones Seized
The… pic.twitter.com/dzor3ONjah
మొత్తం 104 మందిని అదుపులోకి తీసుకోగా.. ఇందులో 86 మంది మ్యూల్ అకౌంట్ హోల్డర్లు (తమ బ్యాంక్ ఖాతాలను అద్దెకు ఇచ్చే వారు), 17 మంది అకౌంట్ సప్లయర్లు, ఓ బ్యాంక్ అధికారి ఉన్నారు. నిందితులు సుమారు 151 బ్యాంక్ ఖాతాల ద్వారా బాధితుల సొమ్మును దారి మళ్లించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా నమోదైన 1,055 సైబర్ కేసులతో వీరికి సంబంధం ఉన్నట్లు తేలింది. ఇటీవల కాలంలో సైబర్ మోసాలు భారీగా పెరుగుతున్నాయి. డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయక ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. దాంతో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఆపరేషన్ ఆక్టోపస్ పేరు మీదుగా చర్యలు చేపట్టారు.

ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో ఉంటూ నెట్ వర్క్ ఆపరేట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, దిల్లీ, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, హరియాణా తదితర రాష్ట్రాలను గుర్తించారు. ఈ రాష్ట్రాల్లో ఉన్న సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు 32 ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి ఆపరేషన్ ఆక్టోపస్ నిర్వహించారు. ఈ ముఠా సుమారు రూ. 127 కోట్ల మేర సైబర్ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ క్రమంలో పెట్టుబడి స్కామ్ లు, ట్రేడింగ్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్ వంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications