తెలంగాణాలో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్; రేపటినుండి వర్షాలుపడే అవకాశమున్న జిల్లాలివే: IMD వార్నింగ్!!
తెలంగాణ రాష్ట్రంలో రోళ్ళు పగిలే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిప్పుల కొలిమిని తలపించేలా ప్రచండ భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో ఒకపక్క ఎండల పైన అలెర్ట్ ఇస్తూనే, మరొకవైపు కొన్ని జిల్లాలలో వర్షాలు కురుస్తాయని, ఏ జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో క్లియర్ గా భారత వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది.
నేడు ఈ జిల్లాలలో వడగాలులు.. IMD అలెర్ట్
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉంటుందో, ఏ జిల్లాలలో ఎండలు, ఏ జిల్లాలలో వానలు కురిసే అవకాశం ఉందో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ఏప్రిల్ 6వ తేదీన అంటే నేడు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో వడగాలులు ఇస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని భారత వాతావరణ శాఖ సూచించింది.

ఈ జిల్లాలలో నేడు ఆరెంజ్ అలెర్ట్
అయితే నేడు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో 41 డిగ్రీల నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి అని పేర్కొంది. ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, సూర్యాపేట, వనపర్తి, జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల ప్రజలు ఎండ సమయంలో బయటకు రాకుండా ఉండాలని సూచించింది.
రేపు ఈ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో వర్షాలు
ఏప్రిల్ 7వ తేదీన ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని, కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
రేపు ఈ జిల్లాలలో మాత్రం వేడి గాలులు, ఉక్కపోత
కొన్ని జిల్లాలలో వర్షాలు కురుస్తుంటే తెలంగాణ జిల్లాలైన రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లిలో విపరీతమైన ఎండతో కూడిన ఉక్కపోత పరిస్థితులు, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలలో ఎండతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఏప్రిల్ 8న ఈ జిల్లాలకు వర్ష సూచన
ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ఉరుములు మెరుపులతో కూడిన 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో వీచే అవకాశం ఉందని, కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోని ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈ జిల్లాలలోనూ కాస్త వాతావరణం చల్లబడే అవకాశం
అంతేకాదు జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలలో కూడా ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఈ జిల్లాలలోనూ కాస్త వాతావరణం చల్లబడే అవకాశం ఉంది.
ఏప్రిల్ 9న ఇలా..
ఏప్రిల్ 9వ తేదీన ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు, తేలికపాటి వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. మొత్తంగా భానుడి భగభగలతో పాటు, తేలికపాటి వర్షాలు కూడా ఉండటంతో అందుకు తగినట్టు రైతులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications