కేంద్రంపై ఆగ్రహం: బందులో 9 లక్షల మందికి పైగా కెమిస్ట్‌లు
అన్నిరకాల వస్తువుల మాదిరిగానే ఆన్‌లైన్‌లో మందులు (వైద్య సంబంధ డ్రగ్స్) విక్రయించడానికి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ అనుమతిని నిరసిస్తూ ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు మంగళవారం
హైదరాబాద్/అమరావతి/తిరుపతి: అన్నిరకాల వస్తువుల మాదిరిగానే ఆన్‌లైన్‌లో మందులు (వైద్య సంబంధ డ్రగ్స్) విక్రయించడానికి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ అనుమతిని నిరసిస్తూ ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు మంగళవారం మెడికల్ షాపులు బంద్ పాటిస్తున్నారు.
బంద్ నేపథ్యంలో ఎమర్జెన్సీ సర్వీసులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. మెడికల్ వ్యవస్థను సర్వనాశనం చేయనున్న ఆన్‌లైన్‌లో మందుల సరఫరా విధానాన్ని తక్షణమే రద్దుచేసే వరకు తమ పోరాటం సాగుతుందని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు.

ఎమెర్జెన్సీ మెడికల్ షాప్స్ తీసి ఉంటాయి
ఎమర్జెన్సీ సర్వీస్ ఫార్మసీలు, ఆసుపత్రుల వద్ద అవసమరయ్యే చోట మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయని రిటెయిల్ డిస్ట్రిబ్యూటర్స్ కెమిస్ట్ అసోసియేషన్ సందీప్ నగారియా చెప్పారు.
దేశవ్యాప్తంగా తొమ్మిది లక్షలకు పైగా కెమిస్ట్స్ బందులో పాల్గొంటారని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ) తెలిపింది. కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, స్పందన లేదని అందుకే ఈ నిరసన గళం అని చెబుతున్నారు.
మరోవైపు, హోటల్ రంగంపై జిఎస్టీ విధానంలో పెంచిన పన్ను శాతాన్ని తగ్గించాలని కోరుతూ మే 30వ తేదీన దక్షిణాది రాష్ట్రాల్లో ఒకరోజు పాటు హోటళ్ల బంద్ నిర్వహించనున్నట్లు ఏపీ హోటళ్ల అసోసియేషన్ నాయకులు చెప్పారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications