వైరల్ వీడియో: వీధి కుక్కలు హల్ చల్.. ఓ చిన్నారి మృతి.. మరొకరి పరిస్థితి..
రాష్ట్రంలో వీధి కుక్కలు హల్ చల్ చేస్తున్నాయి. వీధి కుక్కల దాడుల్లో వరుసగా చిన్నారులు బలైతున్నారు. గ్రామాల్లోని వీధుల్లో సంచరిస్తూ ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. వీధి కుక్కల భయానికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. తాజాగా హనుమకొండ జిల్లా న్యూ శాయంపేటలో షాకింగ్ ఘటన జరిగింది.
నిండా ఏడేళ్లు కూడా లేని చిన్నారిపై వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. పదుల సంఖ్యలో వీధి కుక్కలు ఒక్కసారిగా చిన్నారిపై పడిన దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి వాటిని తరిమేశాడు. దీంతో చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
Shameful, criminal negligence!
— Ashish (@KP_Aashish) October 27, 2025
A little child mauled by stray dogs in #Warangal and the authorities show up only for photo ops after tragedy. How many more children must suffer before you act? No prevention. No accountability. Only empty words after tragedy.#CivicApathy… pic.twitter.com/RjUa1Xerf9
హనుమకొండ జిల్లా న్యూ శాయంపేటలో అక్టోబర్ 26 ఆదివారం ఉదయం షాకింగ్ ఘటన జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఏడేళ్ల శ్రీజ అనే చిన్నారిపై వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. దాదాపు 10 వీధి కుక్కలు ఒకేసారి దాడికి పాల్పడ్డాయి. దీంతో ఆ చిన్నారి కేకులు వేసింది. ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి వాటిని తరిమేశాడు. దీంతో చిన్నారికి ప్రాణాపాయం తప్పింది. ఇందుకు సంబధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలో వీధి కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు నిజామాబాద్ జిల్లా బాల్కొండలో జరిగిన ఓ షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. గడ్డం లక్ష్మణ అనే 10 ఏళ్ల బాలికను నెల రోజుల క్రితం వీధి కుక్క కరిచింది. అయితే భయంతో ఆ చిన్నారి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. అయితే ఆ చిన్నారికి రేబీస్ వ్యాధి సోకింది. మెల్లగా కుక్కలా మొరగడం ప్రారంభించింది. బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. తాజాగా చిన్నారి లక్ష్మణ మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీధి కుక్క కరిచిన విషయాన్ని దాచిపెట్టడం వల్లే బాలిక ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు స్పష్టం చేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications