యాంకర్ విష్ణు ప్రియ అరెస్ట్..?
తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా బెట్టింగ్స్ యాప్స్ గురించే చర్చ సాగుతోంది. బెట్టింగ్ యాప్స్ కారణంగా అనేక మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. తొలుత ఈజీ మనీకి అలవాటు చేసి, ఆ తర్వాత వారి నుంచి లక్షల్లో డబ్బులు కొట్టేయడమే ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల పని. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు పెట్టే వేధింపుల తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు, చేసుకుంటున్నారు కూడా.
ఇటువంటి నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ గురించి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఈ బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులపై సీరియస్‌గా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తూ వచ్చారు.దీంతో తెలంగాణ పోలీసు యంత్రాంగం బెట్టింగ్ యాప్స్ నజర్ పెట్టింది. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తూ తెలంగాణ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

బెట్టింగ్ యాప్స్‌ను కొంత సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు, సెలబ్రిటీలు డబ్బులు కోసం ప్రమోట్ చేశారు. వీరిపై పోలీసులు దృష్టిసారించారు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపైనే కాకుండా, ఆ యాప్స్‌ను ప్రమోట్ చేసిన వారిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. దీనిలో భాగంగానే కొందరు సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది తెలుగు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు.
హర్షసాయి, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, టెస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, బండారు షేషయాని సుప్రిత తదితరులపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు.దీనిలో భాగంగానే పంజాగుట్టు పోలీసులు యాంకర్ విష్ణు ప్రియకు నోటీసులు జారీ చేశారు. గురువారం ఆమె తన లాయర్‌తో కలిసి విచారణకు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె ఈ బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించి కీలక విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది.
తాను మొత్తం 15 బెట్టింగ్స్ యాప్స్‌కు ప్రమోట్ చేసినట్టు ఆమె అంగీకరించింది. దీని కోసం భారీగా డబ్బులు తీసుకున్నట్టు ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఒక్కో వీడియోకు బెట్టింగ్ యాప్ నిర్వాహకులు తనకు రూ.90 వేలు ఇచ్చినట్లుగా తెలిపింది. విష్ణుప్రియ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన పంజాగుట్ట పోలీసులు ఆమె ఫోన్‌ను సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో విష్ణు ప్రియను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంపై విష్ణు ప్రియ ఎలా స్పందిస్తుందో చూడాలి.
-
ధురంధర్2 సూపరంట..పవన్ కల్యాణ్ సినిమా గురించి నోరు తెరవని మన ‘భజన’ హీరోలు -
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్‌బాబు మాటల యుద్ధం -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications