పండుగ వేళ.. 10 రూపాయలకే పట్టుచీర!!

దసరా,దీపావళి పండుగలు వచ్చాయంటే బట్టల షాపుల నిర్వాహకులు బోలెడన్ని బంపర్ ఆఫర్స్ ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఓ చీర కొంటే మరో చీర ఉచితమని, 50 శాతం వరకు డిస్కౌంట్లు, 80 శాతం వరకు డిస్కౌంట్లు అంటూ హంగామా చేస్తారు. షాపింగ్ చేసి కూపన్ తో కార్లు, బైకులు గెలుచుకోమని షాప్ ముందే పెద్ద ప్రదర్శన ఏర్పాటు చేస్తారు.

కస్టమర్లను ఆకట్టుకోవడానికి దుకాణం దారులు చెయ్యని ప్రయత్నాలు ఏవీ ఉండవు. అయితే ఈ సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ప్రధాన షాపుల్లో అదిరిపోయే ఆఫర్లను ప్రకటించారు. జనాలు పండుగ షాపింగ్ తో బిజీగా ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట పట్టణంలోని ఓ షాపు నిర్వాహకులు మాత్రం మహిళలకు పండుగ లాంటి ఆఫర్ ఇచ్చారు.

pattu saree for 10 rupees.. bumper offer in suryapet!!

సూర్యాపేట విఘ్నేశ్వర సిల్క్ సెంటర్ దుకాణందారులు పండుగ సందర్భంగా దుకాణాన్ని పునః ప్రారంభించి ఊహించని ఆఫర్ పెట్టారు. ఇందులో భాగంగా కేవలం 10 రూపాయలకే పట్టుచీర పేరుతో ఆఫర్ ను అందుబాటులోకి తీసుకురావడంతో మహిళలు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. రెండు రోజులపాటు ఈ అద్భుతమైన ఆఫర్ ఉంటుందని దుకాణం దారులు ప్రకటించడంతో కిలోమీటర్ల మేర మహిళలు చీరల కోసం క్యూ కట్టారు.

ఈ ఆఫర్ కింద సుమారు 600 చీరలను అమ్మినట్టు సమాచారం. చాలామంది మహిళలు ఈ ఆఫర్లో భాగంగా చీరలు కొనుగోలు చేయాలనుకుని, కొనుగోలు చేయలేక నిరాశతో వెనుతిరిగినట్టు తెలుస్తోంది. ఇక ఈ ఆఫర్ పుణ్యమా అంటూ షాప్ కు విపరీతంగా రద్దీ పెరిగిందని, కస్టమర్లు తమ షాప్ కి ఎక్కువగా వస్తున్నారని దుకాణందారులు చెబుతున్నారు.

పబ్లిసిటీ కోసం ఎటువంటి ఖర్చు పెట్టకుండానే పది రూపాయలకే పట్టు చీర ఇవ్వడంతో ఈ షాప్ పేరు ఇప్పుడు జిల్లాలో మారుమోగుతుంది. ఈ ఆఫర్ తో ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ బాగుండడంతో, మళ్లీ ఇలాంటి ఆఫర్ పెట్టాలని నిర్వాహకులు ఆలోచిస్తున్నట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+