తెలంగాణా ఎన్నికల రంగంలోకి పవన్ కళ్యాణ్ జనసేన.. పోటీ చేసే స్థానాలివే!!

తెలంగాణ రాష్ట్రంలో వచ్చేఎన్నికలకు జనసేన పార్టీ రెడీ అయ్యింది. తెలంగాణా ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఎన్నికల బరిలోకి దిగడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. వచ్చే ఎన్నికలలో 32 స్థానాలలో పోటీ చేయడానికి జనసేన సిద్ధమైంది.

తెలంగాణ రాష్ట్రంలోనూ ఎన్నికల బరిలో జనసేన పార్టీ ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన పవన్ కళ్యాణ్, పోటీకి సంసిద్ధం కావాలని తెలంగాణ జనసేన నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇక జనసేన పోటీ చేసే స్థానాల పైన ప్రస్తుతం రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

Pawan Kalyan Janasena in Telangana elections in 32seats; here is the contesting list!!

ఒకపక్క తెలంగాణలో సీఎం కేసీఆర్ పై బిజెపి, కాంగ్రెస్ లతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఒత్తిడి పెంచుతున్న వేళ తాజాగా జనసేన పార్టీ కూడా వచ్చే సాధారణ ఎన్నికల కోసం కసరత్తులు ముమ్మరం చేయడం ఆసక్తికర రాజకీయాలకు కారణంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో గెలిచినా, గెలవకున్నా పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని భావిస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర నాయకులతో పవన్ కళ్యాణ్ ఇటీవల సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలను ఎంపిక చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో తాజాగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసే స్థానాలను ప్రకటించింది.

32 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించిన జనసేన కూకట్ పల్లి, ఎల్బీనగర్, నాగర్ కర్నూల్, వైరా, ఖమ్మం, మునుగోడు, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పటాన్ చెరువు, సనత్ నగర్, ఉప్పల్, కొత్తగూడెం, అశ్వరావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ ఘనపూర్, హుస్నాబాద్, జగిత్యాల, నకిరేకల్, హుజూర్నగర్, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, మల్కాజ్ గిరి, ఖానాపూర్, మేడ్చల్, పాలేరు, ఇల్లందు, మధిర అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేయడానికి రెడీ అయింది.

అధికారికంగా ఈ స్థానాలలో జనసేన పోటీ చేస్తున్నట్టు ప్రకటన చేసింది. తెలంగాణలో జనసేన పార్టీ ఎన్నికల బరిలో ఉండనున్న నేపధ్యంలో పవన్ పార్టీ ఓటు బ్యాంకును ఏ మేరకు ప్రభావితం చేస్తుంది.పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చెయ్యటం వల్ల ఎవరికి లాభం జరుగుతుంది? ఎవరికి నష్టం జరుగుతుంది? అన్నది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+