పవన్ వర్సస్ కేసీఆర్, టార్గెట్ రేవంత్ - బీజేపీ బిగ్ టాస్క్, ఆట మొదలు..!!

జనసేనాని పవన్ కల్యాన్ సమర్ధతకు పరీక్ష మొదలైంది. పవన్ రాజకీయ భవితవ్యానికి ప్రస్తుత సమయం కీలకంగా మారుతోంది. తెలంగాణలో బీజేపీతో..ఏపీలో టీడీపీతో కొనసాగుతున్న పవన్ ఇప్పుడు నేరుగా ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు. పవన్ తన ప్రచారంలో సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తారా..రేవంత్ ను లక్ష్యంగా చేసుకుంటారా. బీజేపీతో సహా ఏపీలోనూ ఇదే ఆసక్తి కొనసాగుతోంది. పవన్ ప్రచారం.. ఫలితం ఆధారంగా ఏపీలో పొత్తులు..సమీకరణాలు ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

పవన్ ప్రచారం:తెలంగాణలో బీజేపీ - జనసేన అభ్యర్దులకు మద్దతుగా పవన్ కల్యాణ్ ఈ రోజు నుంచి ప్రచారం ప్రారంభిస్తున్నారు. జనసేన ఈ మేరకు ప్రచార షెడ్యూల్ ప్రకటించింది. వరంగల్, కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక ప్రచార సభల్లో పాల్గొంటారు పవన్. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్‌లో ప్రచారం నిర్వహిస్తారు. రేపు ఉదయం 11 గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం 2 గంటలకు సూర్యాపేట, మధ్యాహ్నం 3 గంటలకు దుబ్బాకలో పవన్‌ కల్యాణ్ ప్రచారం చేస్తారు. టీబీజేపీతో పొత్తులో భాగంగా ఇచ్చిన 8 స్థానాల్లో జనసేన అభ్యర్థులు బరిలో ఉండగా ఈ నెల 25న తాండూరులో.. ఈ నెల 26న కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్‌ తరపున పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నారు.

pawan kalyan to participate election campaign today from warangal, Will he target BRS

టార్గెట్ ఎవరు:ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్న పవన్ తెలంగాణలో బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తెలంగాణలో టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. టీడీపీకి ఏపీలో మిత్రపక్షంగా ఉన్న పవన్ తెలంగాణలో టీడీపీ మద్దతు దారుల ఓట్లతో పాటుగా తెలంగాణలో స్థిరపడిన ఏపీ మూలాలు కలిగిన ఓటర్లను ఆకర్షించి..ఓట్లను సాధిస్తారని బీజేపీ ఆశలు పెట్టుకుంది. దీంతో తెలంగాణ ఎన్నికలు ఇప్పుడు పవన్ సమర్ధతకు పరీక్షగా మారుతోంది. పవన్ ఇక్కడ బీజేపీ ఆశల మేర సక్సెస్ అయితే, ఏపీలోనూ పవన్ కోరిన విధంగా పొత్తులకు బీజేపీ అంగీకరించే అవకాశం ఉంది. టీడీపీ మద్దతు ఓటింగ్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే..ఏపీలో పవన్ కోరుకుంటున్నట్లుగా పొత్తుల ఖరారైన ప్రభావం చూపటం ఖాయంగా కనిపిస్తోంది.

పవన్ సమర్ధతకు పరీక్ష:ఇక..ఎన్నికల ప్రచారంలో పవన్ ప్రధానంగా ఎవరిని టార్గెట్ చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ పైన పవన్ ఎక్కడా ఘాటుగా స్పందించలేదు. ఇప్పుడు ఎన్నికల సమయంలో బీజేపీకి ప్రత్యర్ధులుగా అటు సీఎం కేసీఆర్..ఇటు కాంగ్రెస్ నేత రేవంత్ ఉన్నారు. టీడీపీ మద్దతు దారుల ఓట్లు దక్కించుకోవటంలో ఒక విధంగా రేవంత్ - పవన్ మధ్య పోటీ ఉంది. ఈ సమయంలో పవన్ తన ప్రచార సభల్లో సీఎం కేసీఆర్ గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు..రేవంత్ పైన ఏం మాట్లాడుతారనేది ఆసక్తికరంగా మారుతోంది. ఇక..తెలంగాణలో డిసెంబర్ 3న వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల తరువాత ఏపీ రాజకీయాల్లో బీజేపీ రోల్ పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి...పవన్ కు బీజేపీ ఇచ్చిన టాస్క్ లో ఎంత వరకు సఫలం అవుతారనేదే ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+