వరంగల్ భద్రకాళీ ఆలయంలో పవన్ కళ్యాణ్ సతీమణి పూజలు

పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నెవా ఈరోజు హన్మకొండలో మెరిశారు. సనాతన ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించే పవన్ కళ్యాణ్ కు సతీమణిగా ఉన్న అన్నా లెజ్నెవా భర్త బాటలో దైవభక్తి లో నేను సైతం అంటారు. తాజాగా వరంగల్ మహానగరంలోని చారిత్రక భద్రకాళీ దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నెవా సందర్శించి భద్రకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు..

భద్రకాళీ ఆలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి పూజలు

ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ ధర్మకర్త తొనుపునూరి వీరన్న ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆదిశంకరాచార్యులు, వల్లభ గణపతి దర్శనం చేసుకున్న అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజానంతరం స్నపన మండపంలో ముఖ్య అర్చకులు చెప్పెల వెంకటనాగరాజ శర్మ, వేదపండితులు ప్రదీప్ కుమార్ శర్మలు మహాదాశీర్వచనం చేసి అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలు బహూకరించారు.

pawan kalyan wife Anna Lezhneva visited warangal bhadrakali temple performed special puja

అన్నా లెజ్నెవా దైవ భక్తిపైన ఆసక్తికర చర్చ

అన్నా లెజ్నెవాకు దైవభక్తి చాలా ఎక్కువ. రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన అన్నా లెజ్నేవా భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తూ, హిందూ ధర్మాన్ని పాటించడం పైన ప్రతి ఒక్కరు ఆమె తీరుపై చర్చిస్తారు. ఆమె దైవభక్తి పైన 2025 ఏప్రిల్ లో ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరిగింది.

తిరుమల శ్రీవారికి తలనీలాలు ఇచ్చినప్పుడే చర్చ

తన కుమారుడు అయిన మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన ప్రమాదం నుండి క్షేమంగా కోలుకున్న తర్వాత దానికి కృతజ్ఞతగా అన్నా లెజ్నెవా తిరుమల శ్రీవారికి తలనీలాలను సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. అన్య మతస్థులు ఎవరైనా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే నియమావళి ప్రకారం విశ్వాస ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. అన్నా లెజ్నెవా విశ్వాస ప్రకటన పత్రం పైన సంతకం చేసి స్వామివారిపై ఉన్న తన విశ్వాసాన్ని చాటుకున్నారు.

దైవ భక్తిలో పవన్ లానే అన్నా లెజ్నెవా

అదే సమయంలో అన్నదాన ట్రస్ట్ కు 17 లక్షల రూపాయల విరాళాన్ని కూడా అందించారు. ఇవి మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ ఎన్నికలలో విజయం సాధించినప్పుడు ఆయనకు హారతి ఇచ్చి తిలకం దిద్ది ఆమె తెలుగువారి సాంప్రదాయాన్ని చాటి చాలా ప్రత్యేకంగా నిలిచారు. ఇక తాజాగా హనుమకొండలోని భద్రకాళీ దేవస్థానం అనే సందర్శించి, భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+