ఏపీ, తెలంగాణల్లో.. పవన్‌ని తక్కువ అంచనా వేయొద్దు, డర్టీ మైండ్ వాళ్లే: వర్మ
ముంబై: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో ఆదివారం నాడు స్పందించారు. పవన్‌ను తక్కువగా అంచనా వేయవద్దని, ఆయనను చిన్న చూపు చూసిన వాళ్లంతా చెత్త ఆలోచన ఉన్న వాళ్లేనన్నాడు.
ఏపీ లక్కీ, చెవిటివాళ్లే పవన్‌ని ఆలస్యంగా అర్థం చేసుకుంటారు: వర్మ, 'పవర్' 'స్టార్' అంటే
Going by his understanding of issues in Andhra Pradesh and Telangana and the kind of fans he has,Without doubt P K will be Commander of C's
— Ram Gopal Varma (@RGVzoomin) 11 September 2016
అంతేకాదు, పవన్ కళ్యాణ్ ఓ మంచి కమాండర్ అవుతాడని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని పరిస్థితుల పైన పవన్ కళ్యాణ్‌కు ఉన్న అవగాహనను చూసినా, అలాగే, అతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసినా... అతను కమాండర్లకే కమాండర్ అవుతాడనే విషయంలో ఎలాంటి అనుమానం లేదన్నాడు.
Dirty minded are taking wrong meaning in P K will b biggest C in AP ..I meant C as Commander nd short form was due to twitters 140 chrctrs
— Ram Gopal Varma (@RGVzoomin) 11 September 2016
అంతేకాదు, ఏపీలో అతిపెద్ద కమాండర్‌గా రానున్న పవన్ గురించి చెడు ఆలోచన ఉన్న వాళ్లే తప్పుగా ఆలోచిస్తారని పేర్కొన్నారు. వర్మ తన ట్వీట్‌లో కమాండర్‌కు 'సి' అని ఉపయోగించారు. ట్వీట్ చివరలో.. సి అంటే తన ఉద్దేశ్యం కమాండర్ అని చెప్పారు.












Click it and Unblock the Notifications