Cannes film festival రెడ్ కార్పెట్ పై మెస్మరైజ్ చేసిన మన హైదరాబాదీ సుధారెడ్డి..!
Sudha Reddy:ప్రముఖ బిజినెస్ టైకూన్, బిలియనీర్,ఫిలాంథ్రోపిస్ట్ అయిన సుధారెడ్డి కాన్స్ ఫిలిం ఫెస్టివల్ 2023 రెడ్ కార్పెట్ పై మెరిశారు. తొలిసారిగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో గ్లామర్‌తో అలరించారు.ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ మెగా కృష్ణారెడ్డి సతీమణి సుధా రెడ్డి. పలు అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికలపై కూడా సుధారెడ్డి తళుక్కుమన్నారు.
కాన్స్ ఫిలిం ఫెస్టివల్ 2023 తొలి రోజున ఆమె నీతా లుల్లా డిజైన్ చేసిన జెట్ బ్లాక్ శాటిన్ గౌన్ ధరించారు. ఫాక్స్ లెదర్ హ్యాండ్ గ్లవ్స్ ధరించి వెర్‌సేస్ బ్రాండ్ హ్యాండ్ పర్స్‌తో కనిపించారు. ఇక రాబర్ట్ కావాలీస్ స్ప్రింగ్ 2013 కలెక్షన్ నుంచి జ్యువెలరీ ధరించారు.రెడ్ కార్పెట్ పై అడుగుపెట్టగానే కెమెరాలన్నీ క్లిక్‌మన్నాయి.

ఇక తొలిరోజు రెండో భాగంలో లెస్ ఫైల్స్ డీఓల్ఫా చిత్రం ప్రీమియర్‌కు నీతా లుల్లా డిజైన్ చేసిన మరో అటైర్‌తో సుధారెడ్డి కనిపించారు.ఆమె ధరించిన డైమండ్ నెక్లెస్ అందరి దృష్టిని ఆకట్టుకుంది.ఈ డైమండ్ నెక్లెస్ 115.90 కారట్స్ బరువుటుంది.కొద్ది పాటి మేకప్, వెనక్కు అందంగా కట్టిన హెయిర్‌స్టయిల్‌తో మీర్జాపూర్ యువరాణిలా కనిపించారు.

ఇదంతా అటుంచితే ఫ్యాషన్ రంగంలో హైదరాబాద్‌ను ఖండాతరాలకు చేర్చిన ఘనత సుధారెడ్డికే దక్కుతుంది. కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు హైదరాబాద్ నుంచి అటెండ్ అయిన తొలి నాన్ సినిమా సెలబ్రిటీగా సుధారెడ్డి గుర్తింపు పొందారు.రెడ్ కార్పెట్ పై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా సెలబ్రిటీలకే ఎక్కువ అవకాశం ఉంటుంది.అయితే సుధారెడ్డి చేస్తున్న దాతృత్వ కార్యక్రమాలు, ఛారిటీ పనులే ఆమెకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టాయి. దీర్ఘకాలంలో ప్రపంచంలో గుర్తింపు పొందిన ఫౌండేషన్స్‌తో కలిసి పనిచేసేందుకు ఇదొక చక్కటి అవకాశంగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications