Phone tapping case: ముమ్మర దర్యాప్తు: తొలిసారి స్పందించిన హైదరాబాద్ సీపీ!!
తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తీగ లాగితే డొంకంతా కదులుతుంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న వారిని దర్యాప్తు చేస్తున్న క్రమంలో అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిందని, ఇప్పటివరకు 7 చోట్ల వార్ రూమ్ లను ఏర్పాటు చేసి ట్యాపింగ్ కు పాల్పడినట్టు గుర్తించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారిన దర్యాప్తు
దీని ద్వారా రాజకీయ ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేయడమే కాకుండా, బడా పారిశ్రామికవేత్తలను, వ్యాపార వర్గాలను కూడా టార్గెట్ చేసి, బెదిరింపులకు పాల్పడినట్టు, కోట్లాది రూపాయలు వసూలు చేసినట్టు వెలుగులోకి వచ్చింది. ఇక ఈ కేసులో రాష్ట్రవ్యాప్తంగా వార్ రూమ్ లను ఏర్పాటుచేసిన జిల్లాలలో పోలీసుల పాత్ర పైన కూడా దర్యాప్తు కొనసాగుతుంది.

ఫోన్ ట్యాపింగ్ లో గత ప్రభుత్వంలో మంత్రుల పాత్ర
తెలంగాణ రాష్ట్రాన్ని షేక్ చేస్తున్న ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన మంత్రుల పాత్ర కూడా ఉందన్నది చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వానికి ఇదంతా తెలిసే జరిగిందన్న ఆరోపణలు కూడా వెల్లువగా మారాయి. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు, మునుగోడు ఉపఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలకు ఎర అంశం, అంతేకాదు గత ఎన్నికల్లో పట్టుబడిన ప్రతిపక్ష పార్టీల డబ్బులు కూడా ఫోన్ ట్యాపింగ్ తోనే దొరికినట్టు తెలుస్తుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై తొలిసారి స్పందించిన హైదరాబాద్ సీపీ
ఇదిలా ఉంటే ఇదే సమయంలో ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పారదర్శకంగా కొనసాగుతోందని ఆయన తెలిపారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే విషయంపై కూడా త్వరలోనే విషయాన్ని వెల్లడిస్తామని సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
ఇదిలా ఉంటే గత నెలరోజులుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా పనిచేసిన ప్రభాకర్ రావు, మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు, రాధా కిషన్ రావు లతో పాటు మరికొందరు పోలీసులపై దర్యాప్తు కొనసాగుతుంది.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications