వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్ గుచ్చి గుచ్చి అడిగారు, ఇబ్బంది పడ్డా: కెటిఆర్ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రెస్ క్లబ్ అంటే రిక్రియేషన్ క్లబ్ అని చెప్పే ధైర్యం తాను చేయలేకపోయానని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. ప్రెస్‌ క్లబ్‌ అంటే ఏమిటి, అక్కడ ఏమి చేస్తారు, చేసింది ఏమిటి? చేయబోయేది ఏమిటి? అని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ తనను అడిగారని కెటిఆర్ చెప్పారు.

ఆ ప్రశ్నలకు సమధానం చెప్పడానికి కొంత ఇబ్బంది పడ్డానని, కేవలం రిక్రియేషన్‌ క్లబ్‌ అని గవర్నర్‌కు చెప్పే సాహసం చేయలేకపోయామని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్‌ ఎవరు ఏమి అడిగినా కాదనలేదని అంటూ ప్రెస్‌ క్లబ్‌ విషయం, భవన నిర్మాణం, లీజు విషయమై నిర్దిష్టమైన ప్రణాళికలతో వస్తే సీఎం దృష్టికి తీసుకెళ్లి గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో ప్రకటన చేపిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ప్రెస్‌ క్లబ్‌ హైదరాబాద్‌ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా సోమవారం పత్రికా, మీడియా చానళ్ల సంపాదకులు, సీనియర్‌ సంపాదకులు, జర్నలిస్టులతో సమావేశం జరిగింది. ఇందులో పలువురు పత్రికలు, మీడియా సంపాదకులు, సీనియర్‌ పాత్రికేయుల పాల్గొన్నారు.

గవర్న ర్ గుచ్చి గుచ్చి అడిగారు..

గవర్న ర్ గుచ్చి గుచ్చి అడిగారు..

ఇటీవల ప్రెస్‌ క్లబ్‌ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలకు రమ్మని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను ఆహ్వానించేందుకు వెళ్లినప్పుడు ఇబ్బందికర వాతావరణం ఎదురైందని కెటిఆర్ అన్నారు. ఆయన ప్రెస్‌క్లబ్‌లో ఏమి చేస్తారని గుచ్చి గుచ్చి అడిగారని కెటిఆర్ చెప్పారు.

29న ఉత్సవాలు

29న ఉత్సవాలు

ఈ నెల 29న ప్రెస్‌క్లబ్‌ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలు జరగనున్నాయని, ఆ లోపు ఒక నిర్దిష్ట ప్రణాళికలను రూపొందించాలని ఆయన ప్రెస్‌ క్లబ్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీకి కెటిఆర్ చెప్పారు. నూతన రాష్ట్రంలో వ స్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకెళ్ళాలన్నారు.

ఐక్యంగా ముందుకెళ్లాలి..

ఐక్యంగా ముందుకెళ్లాలి..

ప్రాంతీయ భావ భేదాలు లేకుండా కలిసి మెలిసి క్లబ్బును అభివృద్ధి చేసుకోవాలని కెటిఆర్ సూచించారు. ఎంతో మంది కా ర్పొరేట్‌ సంస్థలకు స్థలాలను ప్రభుత్వం లీజుకు ఇస్తోందని, మీరు కూ డా ముందుకు రావాలన్నారు. ధర్నాలు, గొడవలు లేకుండా అందరినీ క లుపుకొని పోయేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

శ్రీనివాస్ సూచన..

శ్రీనివాస్ సూచన..

ఫిలిం, చిల్డ్రన్స్‌, ఫ్యా మిలీ క్లబ్‌లు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌ అన్నారు. టైమింగ్స్‌ వల్ల డెస్క్‌లో పనిచేసే వారు ప్రెస్‌ క్లబ్‌కు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని, వారి కోసం వా రంలో ఒక రోజును రిజర్వ్‌ చేయాలని సూచించారు. డెస్క్‌ జర్నలిస్టుల ను కూడా భాగస్వామ్యులను చేయాలన్నారు.

మరువ లేనివి..

మరువ లేనివి..

ప్రెస్ క్లబ్ 50 ఏళ్ల వేడుకలు జరుపుకోవడం మరువలేనిదని ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ అ న్నారు. పోటీ ప్రపంచంలో ఇన్‌స్టంట్‌ న్యూస్‌కు ప్రాధాన్యం పెరిగిందన్నారు.

వృత్తి ప్రమాణాలు పెంచుకోవాలి..

వృత్తి ప్రమాణాలు పెంచుకోవాలి..

వృత్తి ప్రమాణాలు పెంపొందించుకోవాలని ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు. స్థలం ఉంది కాని సరైన భవనం లే దు, ఐ అండ్‌ పీఆర్‌ విభాగం సహకరించాలన్నారు. ప్రెస్‌ క్లబ్‌ అందరిదని, తెలంగాణ, ఏపీ ప్రాంతాలవారి విభేదాలకు వేదిక కారాదని, తేడా ఏమి లేదని, ప్రాంతీయ భేదం చూపించొద్దన్నారు.

వృత్తిపరమైన కార్యకలాపాలు...

వృత్తిపరమైన కార్యకలాపాలు...

వృత్తిపరమైన కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని సీనియర్‌ సంపాదకులు ఐ.వెంకట్రావు అన్నారు. నెలకు ఒకసారి సీనియర్‌ సంపాదకులతో సమావేశాలు పెట్టిస్తే బాగుంటుందన్నారు. విభేదాలకు దూరంగా ఉం డి ప్రజలకు జరుగుతున్న విషయాలను వివరంగా చెప్పాలన్నారు.

కలిసి మెలసి ఉందాం..

కలిసి మెలసి ఉందాం..

ఉద్యమం అయిపోయింది, అందరం కలిసిమెలిసి ఉందామని సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. కొత్త జర్నలిస్టులకు పోటీలు పెట్టాలని, దేశంలో ఆదర్శవంతమైన ప్రెస్‌ క్లబ్‌గా తీర్చిదిద్దాలన్నారు.

English summary
Telangana IT minster KT Rama Rao said that governor Narasimhan enquired about the press club activities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X