Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం కేసీఆర్ కు పీఎం మోడీ విషెస్; కారణజన్ములంటూ హరీష్ రావు; వారణాసిలోనూ హోర్డింగ్స్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 68వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న సీఎం కేసీఆర్ కు పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజల దశాబ్దాల కల సాకారం చేసిన ఉద్యమకారుడు అని గులాబీ నేతలు కేసీఆర్ ను కొనియాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు సేవా కార్యక్రమాలతో కొనసాగిస్తున్నారు. ఈరోజు యుద్ధ ప్రాతిపదికన మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

కేసీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపిన ప్రధాని మోడీ


ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు. చిరకాల ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ కేసీఆర్ నా నాయకుడు, నా తండ్రి అని గర్వంగా చెప్పుకుంటా అంటూ ట్వీట్ చేశారు.

మీ జన్మదినం తెలంగాణాకు పండుగ రోజు: హరీష్ రావు

68 వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న సీఎం కేసీఆర్ కు మంత్రి హరీష్ శుభాకాంక్షలు తెలిపారు. మీ జన్మదినం తెలంగాణకు పండుగ రోజు అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని, భావితరాల బంగారు తెలంగాణ ఆయన వల్లే సాధ్యమవుతుందని హరీష్ రావు పేర్కొన్నారు మీరు ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ తలరాత మారిందని పేర్కొన్నారు. మీ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకు పోతోంది అని పేర్కొన్నారు. గత కాలపు వెతలన్నీ తీరి ఇంటింటా సంతోషం వెల్లివిరుస్తుంది అని హరీష్ రావు పేర్కొన్నారు. మీరు కారణజన్ములు, మీ జన్మదినం తెలంగాణకు పండుగరోజు. తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ఈ ముద్దు బిడ్డ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తున్నది.ప్రియతమ నేతకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అని హరీష్ రావు పేర్కొన్నారు.

వారణాసి కూడళ్ళలోనూ కేసీఆర్ హోర్డింగ్స్

వారణాసి కూడళ్ళలోనూ కేసీఆర్ హోర్డింగ్స్

ఇదిలా ఉంటే ప్రధానమంత్రి నరేంద్రమోడీ నియోజకవర్గమైన వారణాసి ప్రధాన కూడళ్లలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ హోర్డింగ్ లు దర్శనమిస్తున్నాయి. వారణాసికి చెందిన మృత్యుంజయ మిశ్రా అనే యువకుడు తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్లో విద్యాభ్యాసం చేయడం జరిగింది. ప్రస్తుతం అతను వారణాసి లో స్థిరపడిన ఇప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల అపారమైన అభిమానం కలిగి ఉండడంతో కెసిఅర్ జన్మదినం సందర్భంగా హోర్డింగులు ఏర్పాటు చేశారు.

Recommended Video

    KCR Uddhav Thackeray Meet కేంద్రంపై యుద్ధం Deve Gowda మద్దతు| Third Front | Oneindia Telugu
     ప్రధాని నియోజకవర్గమైన వారణాసిలో కేసీఆర్ హోర్డింగ్స్ పై చర్చ

    ప్రధాని నియోజకవర్గమైన వారణాసిలో కేసీఆర్ హోర్డింగ్స్ పై చర్చ


    వారణాసి లోని చౌక ఘాట్, పాత మాన్ రోడ్డు, రథయాత్ర ప్రధాన కూడళ్లలో హోర్డింగ్ల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రధాన మంత్రి నియోజకవర్గంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏర్పాటుచేసిన హోర్డింగులు ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+