కేసీఆర్‌కు షాక్: వాహనంలో అణువణువూ సోదా
KCR: లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. వలసలు, చేరికలు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేకించి- ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి వలసల బెడదను ఎదుర్కొంటోంది. సీనియర్లు సైతం కేసీఆర్, ఆయన పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల్లో చేరుతున్నారు.
ఈ పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనడానికి సమాయాత్తం అయ్యారు కేసీఆర్. జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. నీరు అందక ఎండిపోతున్న పంటలను పరిశీలించడానికి ఉద్దేశించిన పర్యటనలు ఇవి. కరవుతో బారిన పడ్డ రైతన్నలను పరామర్శించడం, వారిలో ధైర్యం నింపడానికి ఆయన ఈ పర్యటన చేపట్టారు.

ఈ ఉదయం జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో పర్యటించారు. అక్కడ రైతులను పరామర్శించారు. ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించారు. రైతన్నలతో మాట్లాడారు. అనంతరం అక్కడి నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని అరవపల్లికి బయలుదేరి వెళ్లారు. దీని తరువాత ఆయన నల్గొండ జిల్లా హాలియా మండలంలో పర్యటిస్తారు.
అరవపల్లికి వెళ్తోన్న సమయంలో సూర్యాపేట్ వద్ద పోలీసులు ఆయన వాహనాన్ని తనిఖీ చేశారు. అణువణువూ సోదా చేశారు. సూర్యాపేట్ చెక్‌పోస్ట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. లోక్‌సభ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న కారణంగా ఆయన వాహనాన్ని తనిఖీ చేయాల్సి వచ్చింది.

తెలంగాణలో గల 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఒకే విడతలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడుతాయి. వరంగల్ మినహా ఇప్పటికే అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. వరంగల్ లోక్‌సభ అభ్యర్థి కడియం కావ్య పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో కొత్త నాయకుడి కోసం అన్వేషిస్తోన్నారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications