మోహన్ బాబు ఇంటికి పోలీసులు.. గుట్టు రట్టు!

మంచు మోహన్ బాబు కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య చోటు చేసుకున్న విభేదాల వార్తలు ఈరోజు ఉదయం నుంచి మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తున్నాయి. మంచు మనోజ్ మోహన్ బాబు తనపై, తన భార్య మౌనికపై దాడి చేశాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చిన వేళ మోహన్ బాబు కుటుంబంలో ఎటువంటి దాడి జరగలేదని మోహన్ బాబు పిఆర్ఓ వివరణ ఇచ్చాడు.

మంచు మోహన్ బాబు ఇంట్లో విబేధాలు
అయితే అసలు ఏమీ జరగకుండానే మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గురించి ఇంత చర్చ జరుగుతుందా అంటే కచ్చితంగా కాదు అనే తాజా పరిణామాలు చెబుతున్నాయి. నిప్పు లేకుండా పొగ రాదు అన్నది ఎంత నిజమో మంచు కుటుంబంలో విభేదాలు ఉండడం వల్లే వార్తలు వచ్చాయి అన్నది అంతే నిజం. అయితే ఈ ఈ వాస్తవం తాజాగా పోలీసులు చేసిన వ్యాఖ్యలతో అర్థమవుతుంది.

police clarity on mohan babu family dispute as they got call to dial 100

డయల్ 100కు మోహన్ బాబు ఇంటి నుండి కాల్
మంచు మోహన్ బాబు ఇంటికి వెళ్లిన పహాడీ షరీఫ్ ఎస్ఐ మోహన్ బాబు ఇంట్లో గొడవల గురించి క్లారిటీ ఇచ్చారు. తమకు మోహన్ బాబు ఇంటి నుంచి 100 నెంబర్ కు ఇంట్లో గొడవవుతుంది అన్న కాల్ వచ్చిందని దీంతో తాము హుటాహుటిన జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్ళామని పేర్కొన్నారు .

గొడవ కారణంగానే 100కు కాల్
ఇక రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని మోహన్ బాబు కుటుంబ సభ్యులకు చెప్పామని అయితే వారు కుటుంబంలోని ఇంటర్నల్ సమస్యల కారణంగా కాల్ చేసినట్టుగా పేర్కొన్నారు. ఫిర్యాదు ఇవ్వడానికి మోహన్ బాబు కుటుంబ సభ్యులు సుముఖంగా లేనట్టు పహాడీ షరీఫ్ ఎస్ఐ మాటలను బట్టి అర్థమవుతుంది.

పరువు కోసం స్టేట్ మెంట్ ఇచ్చిన మంచు ఫ్యామిలీ
మోహన్ బాబు కుటుంబ గొడవల గురించి మీడియాలో వార్తలు ప్రసారం కావడంతో అప్రమత్తమైన మంచు కుటుంబం వారి పరువు మర్యాదలకు భంగం వాటిల్లుతుందని గ్రహించి తమ కుటుంబంలో ఎటువంటి గొడవలు లేవని, ఎవరు ఎవరిపైన ఎటువంటి దాడి చేయలేదని, పోలీసులకు ఫిర్యాదు చేయలేదని మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ అవాస్తవాలను ప్రసారం చేస్తున్నారని స్టేట్మెంట్ ఇచ్చారు.

పహాడీ షరీఫ్ ఎస్ ఐ వ్యాఖ్యలతో గుట్టు రట్టు
ఫిర్యాదుల విషయం పక్కన పెడితే కుటుంబ కలహాల వల్ల డయల్ 100 కి మోహన్ బాబు కుటుంబం నుంచి కాల్ వెళ్లిన మాట మాత్రం వాస్తవం అని పహాడీ షరీఫ్ ఎస్ ఐ స్పష్టం చేశారు. ఏది ఏమైనా గతంలో కూడా మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోమారు తారాస్థాయికి చేరిన క్రమంలోనే ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+