హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీడియా ముందుకు దొంగబాబా: రూ. 1.30 కోట్లను శివ ఎలా కొట్టేశాడంటే (ఫోటోలు)

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులోని లైఫ్ స్టైల్ బిల్డింగ్ యజమాని, రియల్టర్ మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని ఆసుపత్రి పాలు చేసి రూ. 1.30 లక్షల రూపాయలు కాజేసిన కేసులో అరెస్ట్ చేసిన శివానందబాబా పాటు మరో ఇద్దరిని శుక్రవారం సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టారు.

మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని ఆసుపత్రి పాలు చేసి డబ్బు కాజేసిన వైనాన్ని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి వివరించారు. మోహన్ రెడ్డి అనే మరో వ్యక్తికి కూడా ఈ కేసులో సంబంధం ఉందని, అసలు అతడే తొలుత శివానంద బాబాను మధుసూదన్ రెడ్డికి పరిచయం చేశాడని చెప్పుకొచ్చారు.

అతడే శివానందబాబాకి అతీంద్రియ శక్తులు ఉన్నట్లు చెప్పాడని, ప్రస్తుతం అతడు పరారీలో ఉండటంతో గాలిస్తున్నామని ఆయన అన్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం... బెంగళూరులో ఉండే శివ, మోహన్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా మధుసూదన్ రెడ్డికి పరిచయమయ్యాడు.

గతంలో బెంగళూరు గోల్ఫ్ క్లబ్‌లో కలిసినప్పుడు శివ లక్ష రూపాయలను రెండు లక్షలుగా చేసినట్లు మభ్యపెట్టి మధుసూదన్ రెడ్డిని నమ్మించాడు. ఈ ఘటన తర్వాత నుంచి వీరిద్దరి మధ్య పరిచయం కొనసాగింది. ఈ క్రమంలో లక్ష్మీపూజ ద్వారా డబ్బును రెట్టింతలు చేస్తానని, రైస్ పుల్లింగ్ కాయిన్ కూడా ఉందని, దీన్ని విదేశాల్లో అమ్మితే వందల కోట్లు వస్తుందని శివ చెప్పాడు.

దీనిని నమ్మేసిన మధుసూదన్ రెడ్డి తన ఇంట్లో పూజ చేయించుకోడానికి 14వ తేదీన బెంగళూరు నుంచి టాక్సీ బుక్ చేసి అక్కడి నుంచి శివను రప్పించి బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ఉంచాడు. దీని తర్వాత మధుసూదన్ రెడ్డికి తెలియకుండా దామోదర్, శ్రీనివాసరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు రంగ ప్రవేశం చేశారు.

రూ.1.33 కోట్ల టోకరా, ఇలా ముగ్గులోకి దింపి..: ఎవరీ దొంగబాబా?రూ.1.33 కోట్ల టోకరా, ఇలా ముగ్గులోకి దింపి..: ఎవరీ దొంగబాబా?

వారికి రెట్టింపు ఇస్తానని చెప్పి వారి నుంచి మూడు లక్షలు తీసుకున్నాడు. వారిని ఫలానా చోట ఉండమని చెప్పాడు. ఆ తర్వాత, పూజలు చేయడానికి వివిధ సామాన్లు కావాలని సూచించడంతో మధుసూదన్ రెడ్డి కోఠిలోని ఎంజీ రోడ్డులో పూజసామగ్రి కొనుగోలు చేశారు.

మీడియా ముందుకు దొంగబాబా: రూ. 1.30 కోట్లను శివ ఎలా కొట్టేశాడంటే

మీడియా ముందుకు దొంగబాబా: రూ. 1.30 కోట్లను శివ ఎలా కొట్టేశాడంటే

దీంతో అతనిపై వారికి నమ్మకం ఏర్పడింది. ఇంట్లో ఇంకా డబ్బులంటే పూజలో పెట్టాలని, దానిని డబుల్ చేస్తానని చెప్పడంతో పూజ కోసమే తాను తెప్పించిన రూ. 1.30 కోట్లను మధుసూదన్ రెడ్డి పూలరేకుల వద్�� పెట్టారు. అనంతరం పూజలు చేశాడు.

మీడియా ముందుకు దొంగబాబా: రూ. 1.30 కోట్లను శివ ఎలా కొట్టేశాడంటే

మీడియా ముందుకు దొంగబాబా: రూ. 1.30 కోట్లను శివ ఎలా కొట్టేశాడంటే

తరువాత ఉమ్మెత్త ఆకులు, సీసం కలిపి తయారు చేసిన ప్రసాదం వారిచేత తినిపించాడు. పూజ మధ్యాహ్నం వరకు కొనసాగినా డబ్బు మాత్రం రెట్టింపు కాలేదు. దీంతో పూజలో ఏదో తప్పు జరిగింది... దగ్గర్లోని గుడిలో ఈ పూజలు చేద్దామని చెప్పి దంపతులను ఇంట్లోనే ఉంచి, కేవలం సందేశ్‌రెడ్డిని మాత్రం త���వెంట ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్న గుడికి వెళ్లాడు.

మీడియా ముందుకు దొంగబాబా: రూ. 1.30 కోట్లను శివ ఎలా కొట్టేశాడంటే

మీడియా ముందుకు దొంగబాబా: రూ. 1.30 కోట్లను శివ ఎలా కొట్టేశాడంటే

అక్కడ పూజ చేసిన తర్వాత తన చేతులు కడుక్కోవాలని అతడిని హోటల్ వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే ఉమ్మెత్త ఆకులు, సీసం కలిసిన ప్రసాదం తినడంతో కుటుంబ సభ్యులు నెమ్మదిగా మగతలోకి జారుకోవడం ప్రారంభించారు. ఇంతలో 'రూంలో కాసేపు ధ్యానం చేద్దాం, నీ దగ్గర మెటల్ ��స్తువులు ఏవైనా ఉంటే దానిని శరీరానికి దూరంగా ఉంచు' అంటూ సందేశ్ రెడ్డికి సూచించాడు.

మీడియా ముందుకు దొంగబాబా: రూ. 1.30 కోట్లను శివ ఎలా కొట్టేశాడంటే

మీడియా ముందుకు దొంగబాబా: రూ. 1.30 కోట్లను శివ ఎలా కొట్టేశాడంటే

దాంతో సందేశ్ రెడ్డి కారు తాళాలు, ఫోను, ఇతర వస్తువులన్నీ పక్కన పెట్టారు. కాస్త మగతగా ఉన్న అతడిని ఏమార్చి కారు తాళాలు తీసుకుని, నేరుగా కిందకు వచ్చి కారులో ఉన్న రూ. 1.30 కోట్ల మొత్తాన్ని టాక్సీలోకి మార్చేశాడు. తర్వాత ఏమీ ఎరగ��ట్టు పైకి వచ్చి, కార్ తాళాలు అక్కడే పెట్టేశాడు.

మీడియా ముందుకు దొంగబాబా: రూ. 1.30 కోట్లను శివ ఎలా కొట్టేశాడంటే

మీడియా ముందుకు దొంగబాబా: రూ. 1.30 కోట్లను శివ ఎలా కొట్టేశాడంటే

అప్పటికే సందేశ్ రెడ్డికి కూడా మగతగా ఉండడంతో కారులో డబ్బు చూసుకోకుండా ఇంటికి వెళ్లిపోయాడు. తీరా ఇంటికి వెళ్లిన తర్వాత సందేశ్ రెడ్డి చూసుకుంటే కారులో డబ్బు లేదని తెలిసింది. లోపల తల్లిదండ్రులు ఇద్దరూ స్పృహతప్పి ఉండటంతో వారిని ఆస్పత్రికి తీసుకెళ్లా���ు.

మీడియా ముందుకు దొంగబాబా: రూ. 1.30 కోట్లను శివ ఎలా కొట్టేశాడంటే

మీడియా ముందుకు దొంగబాబా: రూ. 1.30 కోట్లను శివ ఎలా కొట్టేశాడంటే

అనంతరం తాను బుక్ చేసుకున్న టాక్సీలోనే కొంతదూరం వెళ్లి, దామోదర్, శ్రీనివాసరెడ్డిలను జీవీకే మాల్ వద్దకు పిలిపించాడు. తనవద్ద ఉన్న రూ. 1.30 కోట్ల లోంచి రూ. 12 లక్షలు తీసి వాళ్లకు ఇచ్చాడు. ఆ తర్వాత 'రాత్రి 8 గంటలకు మళ్లీ వస్తాను, ఇక్కడే వుండు' అని చెప్పి తన క్యాబ్ డ్రైవర్ కు చెప్పి, అతని మైండ్ డైవర్ట్ చేసి ఆటో ఎక్కేశాడు

మీడియా ముందుకు దొంగబాబా: రూ. 1.30 కోట్లను శివ ఎలా కొట్టేశాడంటే

మీడియా ముందుకు దొంగబాబా: రూ. 1.30 కోట్లను శివ ఎలా కొట్టేశాడంటే

తర్వాత అక్కడినుంచి ఆటోలో ఆరాంగఢ్ చౌరస్తాకు వెళ్లాడు. అక్కడ బ్యాగులు కొనుక్కుని, డబ్బు వాటిలో ప్యాక్ చేసి బెంగళూరుకు బస్సులో వెళ్లిపోయాడు.

అనంతరం మధుసూదన్ రెడ్డి నివాసంలో పూజలు చేయగా, ఆ పూజలో ముందుగానే లక్షా 50 వేల రూపాయలు పెట్టించాడు. అనంతరం వారిని మాయలో ముంచిన శివ చాకచక్యంగా వాటిని 3 లక్షల రూపాయలు చేసినట్టు చూపించాడు. ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు పెడితే చాలా రెట్లు అవుతుందని చెప్పాడు.

English summary
Police commissioner mahender reddy explains sivananda baba 1.30 cr story.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X