8నెలలు ట్రైనింగ్, పరీక్షలలో గోల్డ్ మెడల్ సాధించిన శునకం.. నేడు డ్యూటీలో చేరిక
నేర పరిశోధనలో పోలీస్ జాగిలాల పాత్ర అత్యంత కీలకమైనది. కొన్ని చాలా క్లిష్టమైన క్రిమినల్ కేసులలో నిందితులను పట్టుకోవటంలో పోలీస్ జాగిలాల పాత్ర కొనియాడదగినది. అటువంటి పోలీస్ జాగిలాల పాత్ర నేరాల పరిశోధనలో చాలా కీలకమని వరంగల్ పోలీస్ కమీషనరేట్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.
విధుల్లో చేరిన ట్రైనింగ్ పూర్తి చేసుకున్న జాగిలాలు
మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటిలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ లో ఎనిమిది నెలలపాటు ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్న బీగల్ జాతికి చెందిన 'భైరవ్', 'విరాట్' అనే రెండు జాగిలాలు తాజాగా వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో విధుల్లో చేరాయి. ఈ సందర్భంగా కమిషనర్ స్వయంగా వాటి సామర్థ్యాలను పరిశీలించి అవి ట్రైన్ అయిన విధానాన్ని అభినందించారు.

మెడల్ అలంకరించి జాగిలానికి అభినందన
జాగిలాల హ్యాండ్లర్లు కుమారస్వామి (భైరవ్ హ్యాండ్లర్), సాంబయ్య (విరాట్ హ్యాండ్లర్)లను వారి శిక్షణ, పనితీరు, గుర్తింపు సామర్థ్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. శిక్షణ కాలంలో నిర్వహించిన క్లిష్ట పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించిన భైరవ్‌కు కమిషనర్ ప్రత్యేకంగా మెడల్ అలంకరించి హ్యాండ్లర్‌ను అభినందించారు.
ఆ కుక్కల ప్రత్యేకత చెప్పిన పోలీస్ కమీషనర్
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఈ నూతన జాగిలాలు పేలుడు పదార్థాలను అత్యంత వేగంగా, కచ్చితంగా పసిగట్టగలవని తెలిపారు. చిన్న ఆకారంలో ఉన్నప్పటికీ పెద్ద జాగిలాలు చేరలేని ఇరుకైన ప్రదేశాలు, మార్గాలు, వాహనాల క్రింద భాగాలు, విమానాల్లో ప్రయాణికుల సామాను భద్రపరిచే కేబిన్ల వంటి ప్రాంతాల్లోకి సులభంగా ప్రవేశించి తనిఖీలు చేయగలగడం వీటి ప్రత్యేకత అని వివరించారు.
పోలీస్ జాగిలాల సాయంతోనే నిందితుల గుర్తింపు
ముఖ్యంగా బాంబ్ డిటెక్షన్, మత్తు పదార్థాల గుర్తింపులో ఇవి విశేషంగా ఉపయోగపడతాయని చెప్పారు. గతంలో కూడా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన అనేక కేసుల్లో పోలీస్ జాగిలాల సహాయంతో నిందితులను గుర్తించామని తెలిపారు. ఈ జాగిలాల వల్లే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం సాధ్యమైందని కమిషనర్ వెల్లడించారు. నేర నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు శునకాల సేవల వలనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.
ఇటీవల బ్రోనో పదవీ విరమణ
ఇదిలా ఉంటే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 12 సంవత్సరాల పాటు సేవలు అందించిన బ్రోనో అనే ట్రాకర్ డాగ్‌కు ఇటీవల ఘనంగా వీడ్కోలు పలికారు.ట్రాకర్ జాగిలింగా గుర్తింపు పొందిన బ్రోనో అనే జాగిలం 12 సంవత్సరాల క్రితం వరంగల్ కమిషనరేట్ లో విధుల్లో చేరింది. పలువురు వీఐపీల భద్రతలో కీలక సేవలు అందించిన బ్రోనో, నేర పరిశోధనలలో పోలీసులకు అత్యంత కీలక సేవలు సేవలందించింది.
వరంగల్ కమీషనరేట్ కు రెండు జాగిలాలు
వరంగల్ కమిషనర్ లో 15 క్లిష్టమైన కేసులను ఛేదించి నిందితులను గుర్తించడంలో సహాయపడింది. ఇటీవలే రిటైర్ అయ్యింది. ఇప్పుడు మరో రెండు కొత్త జాగిలాలు ట్రైన్ అయ్యి వరంగల్ కమీషనరేట్ కు వచ్చాయి. అందులో గోల్డ్ మెడల్ సాధించి సత్తా చాటిన భైరవ్ ఉంది.
-
తల నరికి ఇంటికి పట్టుకెళ్లాడు.. !! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!












Click it and Unblock the Notifications