ఎమ్మెల్యే సీతక్కకు చేదు అనుభవం..!!
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు శాసన సభ్యురాలు సీతక్కకు తెలంగాణ సచివాలయం వద్ద చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తోన్న కారును పోలీసులు అడ్డుకున్నారు. కారుతో సహా సచివాలయంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలేదు. ప్రధాన ద్వారం వద్దే కారును నిలిపివేశారు. ఈ ఘటనతో సీతక్క తీవ్ర అసహనానికి లోనయ్యారు.
తన నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లడానికి ఈ సాయంత్రం సీతక్క.. సచివాలయానికి చేరుకున్నారు. దీనిపై అప్పటికే ఆమె అనుమతులను తీసుకున్నారు. పాస్‌ను చూపించి లోనికి వెళ్లబోతోండగా ప్రధాన గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కారుతో సహా లోనికి వెళ్లడానికి అనుమతి లేదని తేల్చి చెప్పారు.

తాను ఎమ్మెల్యేనని, లోనికి వెళ్లడానికి అనుమతులు కూడా ఉన్నాయని సీతక్క వారికి చెప్పారు. కారుతో సహా లోనికి వెళ్లడానికి పర్మిషన్ లేదని, పార్కింగ్ స్థలంలో కారును నిలిపి వెళ్లాలని సూచించారు. దీనితో సీతక్క అసహనానికి గురయ్యారు. వారితో కొద్దిసేపు వాగ్వివాదానికి దిగారు. అయినప్పటికీ- వారు అంగీకరించకపోవడంతో నడుచుకుంటూ సచివాలయంలోనికి వెళ్లారు.
దీనిపై సీతక్క విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. సచివాలయం అద్భుతంగా ఉందంటూ ప్రభుత్వం గొప్పలు చెబుతోందని, దీనికి భిన్నంగా ప్రజా ప్రతినిధులను సైతం లోనికి అనుమతించట్లేదని విమర్శించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సచివాలయం లోపలికి ఎందుకు అనుమతించట్లేదంటూ నిలదీశారు.

ఈ అంశంపై తాను రచ్చ చేయాలనుకుంటే చేయగలనని, ప్రజా సమస్యలను వివిధ శాఖల మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి తపై ఇక్కడికి వచ్చానే తప్ప గొడవ పడటానికి కాదని అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని, చివరికి సెక్రటేరియట్‌లోనూ ప్రవేశం లేదనడం సరికాదని చెప్పారు.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications