బిగ్ అలర్ట్.. న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు ఇవే !!
ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ న్యూఇయర్ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సైతం వేడుకలు ఏ రేంజ్ లో జరుగుతాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహా నగరాల్లో సెలబ్రేషన్స్ ఆకాశాన్ని అంటుతాయి. డిసెంబర్ 31 సాయంత్రం నుంచే యువత పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు. అర్థరాత్రి 12 గంటలు తర్వాత ఒకరినొకరు విషెస్ చెప్పుకుంటూ సంబరాలు షురూ చేస్తారు.
ఈ క్రమంలోనే ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పలు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు. స్టార్ హోటళ్లు, క్లబ్‌లు, బార్‌లు, పబ్‌ల నిర్వాహకులు వేడుకలకు 15 రోజుల ముందే అనుమతి పొందాలని సూచించారు. సెలబ్రేషన్స్ కి అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు.

అంతే కాకుండా ఈవెంట్స్ వద్ద సీసీ కెమెరాల నిఘా, ట్రాఫిక్ నియంత్రణ, అశ్లీలతకు తావులేని ప్రదర్శనలు తప్పనిసరి అని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో లౌడ్‌స్పీకర్లు, డీజేలను రాత్రి 10 గంటల కల్లా ఆపివేయాలని.. ఇండోర్ వేడుకల్లో అర్ధరాత్రి 1 గంట వరకు తక్కువ శబ్దానికే అనుమతి అని రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపారు.
బాణసంచా కాల్చడం, సామర్థ్యానికి మించిన పాస్‌లు/టికెట్ల జారీ పూర్తిగా నిషేధం అంటూ క్లారిటీ ఇచ్చారు. వాహన పార్కింగ్‌కు కూడా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. మరీ ముఖ్యంగా నూతన సంవత్సర సంబరాల్లో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వాడకంపై పోలీసులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఇటువంటివి గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను సూచించారు. మైనర్‌లకు వేడుకల్లో ప్రవేశం నిషేధించబడిందని.. డ్రగ్స్ వాడకంపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ప్రతి ఏటా మాదిరిగానే ఎక్సైజ్, నార్కోటిక్స్, పోలీసులు కలిసి అనుమానిత ప్రాంతాలు, పబ్‌లు, బార్‌లలో తనిఖీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. డ్రగ్స్ టెస్టులు నిమిషాల్లోనే గుర్తించే అత్యాధునిక పరికరాలు, డాగ్ స్క్వాడ్ బృందాలను కూడా తనిఖీల్లో వినియోగిస్తారన్నారు. డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా ఉంటాయని.. మద్యం సేవించి వాహనాలు నడపకుండా డ్రైవర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications