YS 'కుయ్ కుయ్' అంటే... KCR 'టింగ్ టింగ్' మంటున్నారు!!
ప్రజల్ని ఆకట్టుకోవడానికి రాజకీయ నాయకులు విచిత్ర వేషాలు వేస్తుంటారు. వేషధారణ మారుస్తుంటారు. రకరకాల హావభావాలు చేస్తారు. ప్రతి రాజకీయ నాయకుడికి ప్రజల్లో తనదంటూ ఒక శైలి ఉంటుంది. కార్యక్రమాల్లో మిమిక్రీ చేసే సమయంలో కూడా వీటినే అనుకరిస్తుంటారు. దీనివల్ల మిమిక్రీ ఆర్టిసులు ఎవరిని అనుకరిస్తున్నారనేది ప్రజలకు సులువుగా అర్థమయ్యేది.

అనుకరించి చూపిన వైఎస్
చంద్రబాబును అనుకరించాలంటే ఆయన గొంతుతోపాటు రెండవేళ్లు విక్టరీ సింబల్ లో చూపించేవారు. అలాగే ముఖ్యమంత్రి జగన్ ను అనుకరించడానికి వైఎస్ లానే ఎడమచేతిని పైకెత్తి చూపించేవారు. ఆయనకంటూ ఉన్న కొన్ని డైలాగులను చెప్పేవారు. గతంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎక్కడ సభల్లో పాల్గొన్నా తాను 108 పేరుతో అంబులెన్స్ లు ప్రవేశపెట్టానని చెప్పేవారు.
ఈ మాటలు వారి మనసుల్లో నాటుకునేందుకు మీరు ఫోన్ చేస్తే కుయ్.. కుయ్.. అంటూ అంబులెన్స్ వస్తుందంటూ తాను కూడా అలాగే సౌండ్ చేస్తూ చెప్పేవారు. సభల్లో ఎక్కడ పాల్గొన్నా ఈ చిత్రాన్ని చేసేవారు. దీన్ని అందరూ ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు.

వైఎస్ బాట పట్టిన కేసీఆర్
తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వైఎస్ బాట పట్టారు. జగిత్యాల కలెక్టరేట్ ను ప్రారంభించిన అనంతరం తాజాగా జరిగిన ఒక సభలో కేసీఆర్ మాట్లాడుతూ రైతుబంధు పథకం అమలవుతోంది.. మరో ఐదు, 10 రోజుల్లో మీ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రకటించారు. అయితే ఆయన దీన్ని సాదాసీదాగా చెప్పలేదు. పదిరోజుల్లో రైతుబంధు పడుతది.. బ్యాంకుల్లో పడగానే టింగు టింగు మంటూ ఫోన్ కు మెసేజ్ వస్తది అంటూ హావభావాలతో చెప్పారు. వాస్తవానికి నవంబరులో పడాల్సిన రైతుబంధు ఆలస్యమైంది. కాకపోతే 10 రోజులని కేసీఆర్ చెప్పారు.

ఆకట్టుకోవాలంటే అనుకరించాల్సిందే!
ప్రజల్ని ఆకట్టుకోవడానికి చెప్పడం ఒక్కటే సరిపోదని, అనుకరించి చూపించాలని రాజకీయ నాయకులు ధృఢనిశ్చయానికి వచ్చారు. ప్రతి నేత సభలు, సమావేశాల్లో తరుచుగా ఇలా ప్రదర్శించి ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ప్రధానమంత్రి మోడీ అయితే ఆయా ప్రాంతాలకు తగ్గట్లుగా ఉండే వేషధారణను అనుకరిస్తారు. ఏ రాష్ట్ర పర్యటనకు వెళితే ఆ రాష్ట్ర సంస్కృతికి తగ్గట్లుగా వేషధారణతోపాటు స్థానిక భాషలో నమస్కారం చేస్తారు.
-
హైదరాబాద్ లో అద్దిరిపోయే అడ్వెంచర్ పార్క్.. సాహసం చేయడంలో తగ్గేదేలే..! -
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..!












Click it and Unblock the Notifications