పొలిటికల్ స్టార్.. తెలంగాణా కాంగ్రెస్ కమాండర్ రేవంత్ రెడ్డి ఈజ్ బ్యాక్!!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలలో సత్తా చాటి మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని వ్యూహాలు పన్నుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకొని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి దిగారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన ఈ పార్లమెంట్ ఎన్నికలకు కూడా కమాండర్ గా కాంగ్రెస్ దళాన్ని ముందుకు నడిపించనున్నారు.

కాంగ్రెస్ ను ఏకతాటి మీద నడిపే ప్రయత్నంలో రేవంత్
2018 అసెంబ్లీ ఎన్నికలలో కొడంగల్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓటమిపాలైన రేవంత్ రెడ్డి ఆ తర్వాత మల్కాజ్గిరి పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు .తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రథసారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన అస్తిత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీని ముందు వరుసలోకి తీసుకువచ్చి గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేలా చేశారు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి పార్టీని ఏకతాటి మీద ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు.

Political Star T Congress Commander Revanth Reddy is back for loksabha polls

అతడే ఒక సైన్యంగా పార్లమెంట్ ఎన్నికలకు
తాజాగా రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికలలో అతడే ఒక సైన్యంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి కమాండర్ గా ఎన్నికల ప్రహసనాన్ని ముందుకు నడిపించనున్నారు. ఈసారి లోక్సభ ఎన్నికలలో గెలవాలని, కేంద్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉన్న క్రమంలో మెజారిటీ లోక్సభ స్థానాలపై ఫోకస్ పెట్టింది. ఇక ఈ బాధ్యతను కూడా రేవంత్ రెడ్డికి అప్పగించి రంగంలోకి దింపింది కాంగ్రెస్ హైకమాండ్ .

సుడిగాలి పర్యటనల ప్లాన్ లో రేవంత్ రెడ్డి
తెలంగాణలో ఉన్న మొత్తం 17 లోక్సభ స్థానాలలో 15 లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి మరో మారు ప్రచార పర్వలో దూసుకుపోనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం నియోజకవర్గాల వారీగా సుడిగాలి పర్యటనకు రెడీ అయిన రేవంత్ రెడ్డి తనపై, కాంగ్రెస్ పార్టీపై ప్రజల ఆదరణను మరో మారు చూపాలని విజ్ఞప్తి చేయనున్నారు.

కాంగ్రెస్ కు ఆయనే స్టార్ పొలిటీషియన్
కార్యకర్తల్లో జోష్ నింపి పార్టీ కోసం పనిచేసేలా చేయడంతో పాటు ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతును కూడగట్టడం కోసం రేవంత్ రెడ్డి తనదైన పంధాలో ప్రచార పర్వాన్ని కొనసాగించనున్నారు. స్టార్ పొలిటీషియన్ గా, తెలంగాణ కాంగ్రెస్ కమాండర్ గా ఆయన మళ్ళీ దూకుడు చూపించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+