మాజీ ఎంపీ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు - డిసైడ్ అయినట్లేనా..!?

ఖమ్మం రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కొత్త సంవత్సరం మొదటి రోజు మాజీ మంత్రి తుమ్మల.. మాజీ ఎంపీ పొంగులేటి తమ అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేసారు. తాను మంత్రిగా.. 40 ఏళ్ల రాజకీయాల్లో వ్యవహరించిన తీరు తనకు సంతృప్తి మిగిల్చిందంటూ చెప్పుకొచ్చారు. మరో వైపు మాజీ ఎంపీ పొంగులేటి తన రాజకీయ భవిష్యత్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో తనతో పాటుగా పోటీ చేయటానికి అర్హత ఉన్న తన అనుచరులకు సీట్లు వస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. దీంతో, పొంగులేటి బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా లేక మరో వైపు అడుగులు ఖరారయ్యాయా అనే చర్చ మొదలైంది

తాను ప్రస్తుతం బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి..నాలుగున్నారేళ్లుగా బీఆర్ఎస్ లో దక్కిన గౌరవం చూస్తున్నామని వ్యాఖ్యానించారు. జిల్లాలోని తన అభిమానులో పొంగులేటి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అందులో ఆయన చేసిన వ్యాఖ్యలు పలు ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలోనే పొంగులేటి పార్టీ మార్పు అంశం పైన పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ, ఆ తరువాత ఆయన ఆ వార్తలను ఖండించారు. తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని స్పష్టం చేసారు. ఇప్పుడు స్వరంలో మార్పు కనిపిస్తోంది. బీఆర్ఎస్ లో గుర్తింపు దక్కటం లేదనే అభిప్రాయం ఆయన అనుచరుల నుంచి బలంగా వినిపిస్తోంది. దీంతో, తనతో పాటుగా తనతో పాటుగా ర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి అవకాశం దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. దీంతో, ఈ టికెట్ల ఖరారుకు సంబంధించి మరో పార్టీ నుంచి పొంగులేటి హామీ పొందారా అనే చర్చ కూడా మొదలైంది.

Ponguleti Srinivasa Reddy interesting comments on his future politics, likely to contest for Assembly

బీఆర్ఎస్ లో సిట్టింగ్ లకు సీట్లు తిరిగి ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో, పొంగులేటి కోరుకుంటున్నట్లుగా బీఆర్ఎస్ లో సీట్ల కేటాయింపు సాధ్యం కాదు. ఇదే సమయంలో బీజేపీ నుంచి పొంగులేటికి భారీ ఆఫర్ వచ్చిందనే ప్రచారం జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే పొంగులేటి తాను పోటీ చేసే స్థానం పైన ప్రకటన చేసారు. మూడు స్థానాలను ప్రకటించారు. ఖమ్మం , కొత్తగూడెం, పాలేరులోని ఏదో స్థానం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేసారు. ఖమ్మం, పాలేరులో పొంగులేటికి ఛాన్స్ దక్కటం కష్టంగా కనిపిస్తోంది. కొత్తగూడెం నుంచి కూడా అనుమానంగానే కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో తిరిగి ఎంపీగా పోటీ చేసేందుకు పోటీ ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో పొంగులేటి సరైన సమయం చూసి బీజేపీ కండువా కప్పుకొనే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. మరి పొంగులేటి ఎటువంటి అడుగులు వేస్తారనేది వేచి చూడాలి.Te

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+