కోదండరాంకు జనగామ టిక్కెట్‌పై పొన్నాల స్పందన, టీడీపీలో ఇంకా పోటీదారులు: రేవూరి
జనగామ/హైదరాబాద్: జనగామ సీటు తనదేనని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం నాడు చెప్పారు. తనలాంటి బీసీ నాయకుడిపై ఇలాంటి ప్రచారం పార్టీకి మేలు చేయదని చెప్పారు. జనగామ సీటును వేరే పార్టీకి ఇస్తే ప్రతిపక్షాలకు మేలు చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
తనలాంటి సీనియర్ నాయకుడి సీటును భాగస్వామ్య పక్షాలకు ఇవ్వడం అంటే ప్రతిపక్షాల దాడికి గురికావడమే అన్నారు. జనగామ సీటు కోదండరాంకు ఇస్తారనేది కేవలం ప్రచారం మాత్రమేనని చెప్పారు. తెలంగాణ జన సమితికి జనగామను కేటాయించాలని హైకమాండ్ అడిగితే తాను సమాధానం చెబుతానని అన్నారు.

14 సీట్లు కాదు, టీడీపీలో ఇంకా పోటీదారులు: రేవూరి
తెలుగుదేశం పార్టీకి 14 సీట్లు కేటాయించినట్లు కాంగ్రెస్ పార్టీ చెబుతోందని తెలుగుదేశం పార్టీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి చెప్పారు. టీడీపీలో ఇంకా పోటీ దారులు ఉన్నారని తెలిపారు. నర్సంపేట నుంచి పోటీ చేయాలని భావిస్తున్నానని చెప్పారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తమ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వస్తారని చెప్పారు.
చంద్రబాబుపై మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను తాము ఖండిస్తున్నామని రేవూరి చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగానే చంద్రబాబు లేఖ ఇచ్చారని చెప్పారు. హరీష్ రావు వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నారని చెప్పారు. దిగువ రాష్ట్రాల హక్కులు కాపాడుకోవడం కోసం లేఖలు ఇవ్వడం సాధారణమని చెప్పారు. మనుగడ కోసమే చంద్రబాబు పైన హరీష్ రావు వ్యాఖ్యలు చేశారన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications