తమ్ముడూ లెట్స్ డూ కుమ్ముడూ: చిరు, పవన్ భేటీ, ఎందుకంటే ?

పవన్ కళ్యాణ్ వీలు చూసుకుని అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి చాల సేపు చర్చించుకున్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమా సూపర్ హిట్ అయ్యినందుకు అన్నయ్యను అభినందించారని సమాచారం.

హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాల రోజుల తరువాత భేటీ అయ్యారు. అన్నదమ్ముల భేటీ విషయంలో ఇప్పుడు చర్చ మొదలైయ్యింది.

హైదరాబాద్ లోని చిరంజీవి ఇంటికి వెళ్లిన పవన్ కళ్యాణ్ చాల సేపు అక్కడే గడిపారు. చిరంజీవి 10 ఏళ్ల తరువాత నటించిన ఖైదీ నెంబర్ 150వ సినిమా ముందస్తు విడుదల వేడుకకు పవన్ కళ్యాణ్ వస్తారని అందరూ భావించినా చిరికి ఆయన హాజరుకాలేదు.

Powerstar Pawan Kalyan met Chiranjeevi to congratulate him for his success with Khaidi No 150.

తరువాత సినిమా విడుదల రోజున అన్నయ్య సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీలు చూసుకుని అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి చాల సేపు చర్చించుకున్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమా సూపర్ హిట్ అయ్యినందుకు అన్నయ్యను అభినందించారని సమాచారం.

అయితే వీరి భేటీలో రాజకీయ విషయాలు చర్చకు వచ్చాయా ? కుటుంబ విషయాలు చర్చించారా ? అనే విషయం స్పష్టం కాలేదు. మొత్తం మీద మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారని తెలుసుకున్న మెగా అభిమానులు చాల సంతోషంగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+