iBomma వెనుక ప్రహ్లాద్.. ఇమ్మడి రవి చెప్పిన ఆ ప్రహ్లాద్ ఎవరు?
సినీ పైరసీ సామ్రాజ్యాన్ని ఏలిన ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐ బొమ్మ వ్యవహారం పైన సైబర్ క్రైమ్ పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ కేసులో కీలక దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆయన వెనుక ఎవరెవరు ఉన్నారు? ఎలా ఈ సామ్రాజ్యాన్ని నడిపారు? అన్నదాని పైన విచారిస్తున్నారు.
ఐ బొమ్మ రవిని విచారిస్తున్న సైబర్ క్రైం పోలీసులు
నిన్న నాంపల్లి కోర్టు ఆయనను 12రోజుల కస్టడీకి ఇవ్వడంతో ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో ఇమ్మడి రవి ఉన్నాడు. రవిని గురువారం మధ్యాహ్నం పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. తొలిరోజు విచారణలో ఇమ్మడి రవి నుంచి ఇద్దరు పేర్లను పోలీసులు రాబట్టారు. ప్రసాద్, ప్రహ్లాద అనే ఇద్దరు పేర్లు ఇమ్మడి రవి నుండి రావడంతో ఈ కేసులో వీరు ఏంటి అన్న దానిపైన పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.

రవి నోటి నుండి ప్రహ్లాద్ నే వ్యక్తి పేరు
విశాఖకు చెందిన ప్రసాద్ రవికి పదవ తరగతి స్నేహితుడని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ప్రసాద్ ను విచారించిన పోలీసులు అతని వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
ఇక రవి చెప్పిన ప్రహ్లాద్ అనే వ్యక్తి ఎవరు అనేది ఇంకా తెలియలేదు. రవి పేరు మాత్రమే చెప్పి అతను ఎవరో ఎక్కడ ఉంటాడో తెలియదని పేర్కొన్నాడు.
ప్రహ్లాద్ పేరుతోనే అన్ని డాక్యుమెంట్ లు
కస్టడీలో ఉన్న ఇమ్మడి రవిని ప్రశ్నించిన క్రమంలో అమీర్ పేటలో కోచింగ్ తీసుకున్న సమయంలో పరిచయమైన వ్యక్తి ప్రహ్లాద్ కుమార్ అని చెప్పాడు. ఆ తర్వాత అతను ఎవరో తెలియదని మళ్లీ ప్లేట్ ఫిరాయించారు. అయితే ప్రహ్లాద్ పేరుతోనే ఐ బొమ్మ రవి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు కరీబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ దేశ పౌరసత్వాన్ని తీసుకున్నాడు.
ప్రహ్లాద్ పేరు మీదే ఐ బొమ్మ వెబ్ సైట్ రిజిస్టర్
ఐ బొమ్మ వెబ్సైట్ కూడా అతని పేరుతోనే రిజిస్టర్ చేయించాడు. ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు అసలు ప్రహ్లాద్ అనే వ్యక్తి ఉన్నాడా? ఉంటే అతను ఎవరు? ఎక్కడ ఉంటాడు? ఈ పైరసీ సామ్రాజ్యంలో అతని పాత్ర ఏంటి? ఒకవేళ ఐ బొమ్మ రవి కేసును తప్పుదారి పట్టించడానికి ప్రహ్లాద్ పేరును వాడుతున్నాడా? అని దర్యాప్తు చేస్తున్నారు.
ఎవరీ ప్రహ్లాద్.. దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైం పోలీసులు
ప్రహ్లాద్ ఎవరో బయట వ్యక్తి అయితే ఐ బొమ్మ రవి తన ముఖ్యమైన అన్ని కార్డులను ప్రహ్లాద్ పేరుతో ఎందుకు తీసుకున్నాడు. ఈ ప్రహ్లాద్ ఐ బొమ్మ రవి ఇద్దరు ఒకరేనా? లేదా ప్రహ్లాద్ అనే వ్యక్తి ఐ బొమ్మ రవి వెనుక ఉన్నాడా? వంటి అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 12 రోజుల పాటు రవిని దర్యాప్తు చేయనున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఈ పైరసీ నేర సామ్రాజ్య గుట్టు విప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications