పెళ్లై నాలుగు నెలలే అంతలోనే వివాహిత ఆత్మహత్య, ఏమైంది?

Posted By:
Subscribe to Oneindia Telugu

నిజామాబాద్:ప్రేమించి పెళ్ళి చేసుకొంది. పెళ్ళైనా నాలుగు మాసాలకే నవ వధువు ఆత్మహత్య చేసుకొన్న ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకొంది.కానీ, ఆత్మహత్య చేసుకోవడానికి ముందే రోజే బాధితురాలు తన తల్లిదండ్రులు మాట్లాడి తాను ఇబ్బందులు పడుతున్న విషయాన్ని చెప్పారని మృతురాలి కుటుంబసభ్యులు చెప్పారు.

నిజామాబాద్ పట్టణంలోని గాయత్రీనగర్‌కు చెందిన ప్రవళిక అనే వివాహిత ఆత్మహత్య చేసుకొంది. పెద్దలను ఎదిరించి ఆమె ప్రేమ వివాహం చేసుకొంది. అయితే పెళ్ళి చేసుకొన్న తర్వాత భర్త వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు. ప్రతి రోజూ తనను భర్త ఇబ్బందులకు గురిచేసేవాడని తమకు చెప్పిందని మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

pravallika suicide in Nizambad district

నిజామాబాద్ నగరానికి చెందిన ప్రవళిక ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రేమ్ ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృత్యువాత పడింది.

నిజామాబాద్ హమాల్‌వాడి ప్రాంతానికి చెందిన ప్రవళిక ఫార్మసీ పూర్తి చేసింది. చదువుకొనే సమయంలో తన సీనియర్ విద్యార్ధి కామారెడ్డికి చెందిన ప్రేమ్‌తో ఆమె ప్రేమలో పడింది. పెద్దలను ఎదిరించి ఆమె ప్రేమ వివాహం చేసుకొంది.వీరిద్దరూ వివాహం చేసుకొని 4 మాసాలు అవుతోంది. అయితే వివాహమైన తర్వాత భర్త నుండి ఆమె వేధింపులు పెరిగాయని కుటుంబసభ్యులకు మృతురాలు ప్రవళిక ఫోన్‌లో చెప్పారని వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు అయితే ఈ ఘటనకు సంబందించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pravallika , 22 year old woman suicide on Sunday at Nizambad town. Pravallika married prem four months back. pravallika parents complained against prem to police.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X