TSPSC Paper Leak: ఐపీ అడ్రస్ మార్చి.. యూజర్ ఐడీ, పాస్‍వర్డ్ తో లాగిన్..!
టీఎస్‍పీఎస్సీ పేపర్ల లీక్ కేసులో పోలీసులు కీలక విషయాలు గుర్తించారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న టీఎస్‍పీఎస్సీ పేపర్ల లీక్ కేసులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రవీణ్ సాంకేతిక పరిజ్ఞానంతో చాకచక్యంగా ఏఈ పేపర్ ను లీక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. వారిలో ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, రేణుక, ఆమె డాక్యా, రాజేశ్వర్ నాయక్, నీలేష్ నాయక్, గోపాల్ నాయక్, శ్రీనివాస్, రాజేంద్రనాయక్ ఉన్నారు. వీరిని మంగళవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ
నిందితులకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. నిందితుల కస్టడీ కోరుతూ బేగంబజార్ పోలీసులో కోర్టులో పిటిషన్ వేశారు. ప్రవీణ్ కుమార్ టీఎస్‍పీఎస్సీ కార్యదర్శి పేషీని లీక్ చేయడానికి వాడుకున్నట్లు తెలుస్తోంది. ఏఈ పరీక్షకు కొద్ది రోజుల ముందు కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కు ఇంఛార్జీగా ఉన్న శంకరలక్ష్మి రిపేర్ చేశారు. అ సమయంలోనే నెట్ వర్క్ అడ్మిస్ట్రేటర్ రాజశేఖర్ రెడ్డి శంకరలక్ష్మికి స్టాటిక్ ఐపీ కంప్యూటర్ ఇచ్చాడు.

యూజర్ ఐడీ, పాస్ వర్డ్
ఆ తర్వాత సెక్రెటరీ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ తో శంకరలక్ష్మి సిస్టమ్ లో లాగిన్ అయిన రాజశేఖర్ ఏఈ పేపర్ ను ప్రవీణ్ ఇచ్చిన పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసి ప్రవీణ్ కు ఇచ్చాడు. ప్రవీణ్ ప్రశ్నపత్రాలను ప్రింట్ కూడా తీసుకున్నాడు. పేపర్లను రేణుక, ఆమె భార్త డాక్యాకు ఇచ్చాడు. ఆ తర్వాత రేణుక దంపతులు పేరర్లు అమ్మడానికి ప్రయత్నాలు చేశారు. నీలేశ్ నాయక్, గోపాల్ నాయక్ తో 13.5 లక్షలకు బేరం మాట్లాడుకున్నారు.

అడ్వాన్స్
అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. వారిద్దరితో పాటు రాజంద్ర నాయక్ ను మహబూబ్ నగర్ గండీడ్ మండలం పంచగల్ తండాలోని తమ ఇంటికి తీసుకెళ్ల డాక్యా. మార్చి 5న డాక్యా అభ్యర్థులను తీసుకుని సరూర్ నగర్ లోని పరీక్ష కేంద్రంల పరీక్ష రాయించిన అనంతరం వెళ్లిపోయాడు. రేణుక, డాక్యా దంపతులు ప్రవీణ్ కుమార్ కు మార్చి 2న 5 లక్షలు, 6న మరో రూ.5 లక్షలు ఇచ్చారు.

నగ్న వీడియోలు
ప్రవీణ్ మొబైల్ ఫోన్ లో పోలీసులు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అతని మొబైల్ లో పలువురి మహిళల నగ్న ఫొటోలు, వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. కాగా పేపర్ లీక్ పై టీఎస్ పీఎస్సీ కార్యాలయం వద్ద మంగళవారం ఆందోలన చేసిన బీజేవైఎం నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications