Pre-Wedding shoot: హైదరాబాద్ నడిరోడ్డులో ఆర్టీసీ బస్సులో ప్రీ-వెడ్డింగ్ షూట్, వీడియో వైరల్
హైదరాబాద్: ఇటీవల కాలంలో ప్రీ-వెడ్డింగ్ షూట్లంటూ కొందరు వింత పోకడలకు పోతున్నారు. ఇలా గతంలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. మరికొందరైతే ప్రజలకు ఇబ్బందులు కలిగించి చిక్కులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ.. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ల పిచ్చి కొంత జంటల్లో తగ్గడం లేదు. తాజాగా, ఓ జంట ఏకంగా నడిరోడ్డుపై వాహనాలు రద్దీగా ఉన్న సమయంలోనే ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్ నగరంలో ఓ జంట ఏకంగా ఆర్టీసీ బస్సులో ప్రీ-వెడ్డింగ్ షూట్ జరుపుకుంది. ట్రాఫిక్‌లో ఓ బస్సు ఆగి ఉన్న సమయంలో ఓ జంట ప్రీ-వెడ్డింగ్ షూట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. యువతి బస్సులో నుంచి దిగుతున్నట్లుగా.. అబ్బాయి వెనుక నుంచి వస్తున్నట్లుగా వీడియో ఉంది.

ఆ తర్వాత రోడ్లు, ఫుట్‌పాత్‌లపై కూడా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు. ఈ వీడియోపై చాలామంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఎస్ఆర్టీసీని ట్యాగ్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రాఫిక్‌లో నడిరోడ్డుపై నిలిచిన బస్సు వద్ద షూటింగ్ చేయడాన్ని తప్పుబడుతున్నారు. వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు కలిగేలా ఉన్న ఇలాంటి చర్యలను కట్టడి చేయాలని కోరుతున్నారు.

కాగా, ఇప్పుడు పెళ్లంటే చాలు.. చాలా మంది ప్రీ-వెడ్డింగ్ షూట్ లంటూ ఎగబడుతున్నారు. ఇలా పెళ్లి ముహూర్తం పెట్టుకోవడమే ఆలస్యం... అలా ప్రీ-వెడ్డింగ్ షూట్ కోసం జంటలు రెడీ అవుతున్నాయి. తమకు నచ్చిన ప్రాంతాలకు వెళ్లి షూట్ చేయించుకొని... పెళ్లిలో ఈ ప్రీ-వెడ్డింగ్ షూట్ వీడియోను ప్రదర్శిస్తున్నారు. జంటలు తమ తమ అభిరుచులకు అనుగుణంగా ప్రాంతాలను ఎంచుకుంటే... ఫోటో గ్రాఫర్ తన క్రియేటివిటికి పదును పెట్టి వీడియోను సిద్ధం చేస్తున్నారు.
Are Hyderabad roads now the backdrop for pre-wedding tales?
— ⚠☄⚕Bad Drivers of Hyderabad ⛙⛴☣ (@trafficpunisher) January 7, 2024
I'm all in for urban fairy tales, but let’s ensure our roads don't steal the spotlight with unexpected plot twists. Seeking your department's wisdom on this @tsrtcmdoffice@TSRTCHQ @HYDTP #Hyderabad#RoadSafety#Tsrtc pic.twitter.com/mfSTxktmNC
అయితే కొన్నిసార్లు వెడ్డింగ్ షూట్లు విషాదంగా మారుతుండటం గమనార్హం. ఓ జంట జలాశయంలో ప్రీ వెడ్డింగ్ చేసుకుంటూ అందులో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయింది. మరికొందరు పోలీసు కేసుల్లో చిక్కుకున్నారు. ఈ క్రమంలో ప్రీ-వెడ్డింగ్ షూట్లను జాగ్రత్తగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే మంచిదనే సూచనలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications