ఫిజిక్స్ టీచర్ కెమిస్ట్రీ, మెడలో తాళి, కట్ చేస్తే POCSO
పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే ఒక విద్యార్థిని జీవితాన్ని చీకట్లోకి నెట్టేశాడు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా పోచారం డివిజన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది.
పోచారం డివిజన్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని, అదే స్కూల్‌లో ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పర్రే మైటీన్ (27) మాయమాటలతో ప్రేమలో పడేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తరగతి గదిలో మొదలైన పరిచయం, నెమ్మదిగా నమ్మకంగా మారి, చివరకు చట్టాన్ని లెక్కచేయని స్థాయికి చేరింది.

పిల్లలపై బాధ్యత కలిగిన ఉపాధ్యాయుడిగా ఉండాల్సిన వ్యక్తి, విద్యార్థినిని తన మాటలతో మోసం చేసి, కుటుంబానికి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బయటకు రావడానికి దాదాపు 20 రోజులు పట్టింది.
ఇటీవల విద్యార్థిని మెడలో పసుపు తాడు కనిపించడంతో తల్లి షాక్ కు గురైంది. తన దైన స్టైల్లో పదే పదే ప్రశ్నించగా, చివరకు జరిగిన మొత్తం విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు గుండె బరువెక్కింది.
తక్షణమే పాఠశాల నిర్వాహకులను ప్రశ్నించిన బాలిక కుటుంబ సభ్యులకు, అక్కడి నుంచి నిర్లక్ష్యమైన సమాధానాలు రావడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. విషయం తీవ్రతను గ్రహించిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. బాలిక మైనర్ కావడంతో, ఉపాధ్యాయుడు పర్రే మైటీన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం కేసుపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటన మరోసారి ఒక చేదు ప్రశ్నను లేవనెత్తుతోంది. పిల్లలు సురక్షితంగా ఉండాల్సిన స్కూల్ గోడల మధ్యే ఇలాంటి నేరాలు ఎలా జరుగుతున్నాయి? తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు, వ్యవస్థలు ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని ఈ ఘటన తీవ్రంగా గుర్తు చేస్తోంది.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications