హైదరాబాద్‌లో రెండ్రోజులపాటు 144 సెక్షన్ అమలు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌ : నగరంలో మంగళవారం నుంచి 48 గంటల పాటు 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. డిసెంబర్‌ 6న బ్లాక్‌ డే సందర్భంగా నగరంలో నిషేదాజ్ఞలు విధిస్తూ పోలీస్‌ కమిషనర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

 Prohibitory orders in Hyderabad ahead of Black Day

ర్యాలీలు, ప్రదర్శనలు, పబ్లిక్‌ మీటింగ్‌లు, సమావేశాలను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. 144 సెక్ష‌న్ అమ‌లులో ఉన్న ప్రాంతాల్లో న‌లుగురు లేదా అంత‌కుమించి ఒకేచోట గుమికూడి ఉండ‌టం, స‌భ‌లు, స‌మావేశాల్లో ఉద్రేక‌పూరిత, ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టేలా ప్ర‌సంగాలు చేయ‌డం నిషేధ‌మ‌ని స్పష్టం చేశారు.

స‌భ‌లు, స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌కు ముంద‌స్తు అనుమతి త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల‌ని అన్నారు. ఈ ఉత్త‌ర్వుల‌కు విరుద్దంగా వ్య‌వ‌హ‌రించేవారిపై క్రిమినల్ కేసులు న‌మోదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. ఈ నిషేధాజ్ఞలు డిసెంబర్ 5న ఉదయం 6.00 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 6.00 అమలులో ఉంటాయని సీపీ వివరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prohibitory orders under Section 144 of the Code of Criminal Procedure will be in vogue in Hyderabad from 0600 hrs on Tuesday, till 0600 hrs on Thursday, City Police Commissioner VV Srinivasa Rao announced on Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి