రగులుతున్న రాజకీయం.!తగ్గేదే లే అంటున్న షర్మిళ, దేత్తడి పోషమ్మగుడి అంటున్న జగ్గారెడ్డి.!
సంగారెడ్డి/హైదరాబాద్: తెలంగాణ రాజకీయం మరొక్కసారి రంజుగా మారింది. నిన్నటి వరకూ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రి నిరంజన్ రెడ్డిని ఘాటుగా విమర్శించి సంచలనంగా మారిన వైయస్సార్ సీపి అధినేత్రి వైయస్ షర్మిళ నేడు మరో కీలక మలుపుతీసుకుంది. పాద యాత్రలో భాగంగా తాను ఎంటరవుతున్న నియోజక వర్గంలోని ఎమ్మెల్యే పనితీరును ఎండగడతున్న షర్మిళ, తాజాగా సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మీద విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. షర్మిళ ఆరోపణలపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటుగా ప్రతిస్పందిస్తున్నారు.

షర్మిళ సంచలన వ్యాఖ్యలు..
సంచలనాలకు వైయస్ షర్మిల మహాప్రస్థానం పాద యాత్ర కేరాఫ్ అడ్రెస్ గా మారుతోంది. ఏ నియోజక వర్గంలో పాదయాత్ర ప్రవేశిస్తే ఆ నియోజర వర్గ ఎమ్మెల్యేనో, మంత్రినో టార్గెట్ చేస్తూ షర్మిళ ఘాటుగా స్పందిస్తున్నారు. ఆయా నియోజకవర్గ అభివృద్దిలో వారి పాత్ర ఎంతవరకూ ఉంది అనే కోణంలోనే కాకుండా ఆయా ఎమ్మెల్యేల అవినీతి, ప్రయివేటు వ్యాపారాల వ్యావహారాల గురించి షర్మిళ నిర్బయంగా స్పందిస్తున్నారు. వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, విప్ గువ్వల బాలరాజు, మరో మంత్రి వి.శ్రీనివాస గౌడ్ ల షర్మిళ పదునైన పదజాలంతో విమర్శనాస్త్రాలను సంధించారు.

జగ్గారెడ్డిపై బాణం ఎక్కుపెట్టిన షర్మిళ..
షర్మిళ వ్యాఖ్యలకు ప్రతిస్పందించడంలో విఫలమైన తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేసారు. షర్మిళ వ్యాఖ్యలకు, ఆరోపణలకు అడ్డుకట్ట వేయాల్సిందిగా సభాపతికి వారు విన్నవించుకున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో షర్మిళ ఎంత వేగంతో దూసుకెళ్తుందో అర్ధం చేసుకోవచ్చు. మంత్రులు, ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో పాదయాత్ర చేస్తూ వారినే యధేచ్చగా విమర్శిస్తూ షర్మిళ సాహసోపైతంగా ముందుకు కదులుతున్నారు. తాజాగా సంగారెడ్డి నియోజక వర్గంలో ప్రవేశించిన షర్మిళ వచ్చి రాగానే కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి ని టార్గెట్ చేసారు.

రాజకీయ వ్యభిచారి అనడం తగదు..
సంగారెడ్డి ఎమ్మెల్యే ఎవరు, ఎన్ని పార్టీలు మారాడు అంటూ మొదలు పెట్టిన షర్మిళ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు జగ్గారెడ్డి కట్టు బానిస అనే రీతిలో విమర్శనాస్త్రాలు సంధించారు. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ది గురించిగాని, లక్షఎకరాలకు వ్యవసాయ నీటి గురించిగాని, ఇతర మౌళిక సదుపాయాల గురించి గానీ ఏనాడైనా సీఎం చంద్రశేఖర్ రావును నిలదీసాడా జగ్గారెడ్డి అని సంగారెడ్డి ప్రజానికాన్ని షర్మిళ ప్రశ్నించారు. ఏడాదికో పార్టీ మారుతూ రాజకీయ వ్యభిచారిగా జగ్గారెడ్డి మారిపోయాడని ఘాటు వ్యాఖ్యలు చేసారు షర్మిళ. షర్మిళ మొదటిరోజు చేసిన వ్యాఖ్యలకు సాదాసీదాగా స్పందించిన జగ్గారెడ్డి తర్వాత షర్మిళ చేసిన అనుచిత వ్యాఖ్యలపట్ల తీవ్రస్దాయిలో స్పందించారు.

షర్మిళ పార్టీ ప్రభావం ఏమాత్రం ఉండదు..
తాజాగా జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల షర్మిళ మరోసారి కట్టలు తెంచుకునే ఆగ్రహాన్ని వ్యక్తం చేయబోతున్నట్టు తెలుస్తోంది. రాజకీయ వ్యభిచారి అన్న మాటను తాను తిరిగి ప్రయోగిస్తే షర్మిళ పరిస్ధితి ఏంటని జగ్గారెడ్డి ప్రశ్నించడం పట్ల షర్మిళ అంతే స్థాయిలో విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాను పార్టీలు మారలేదని, దివంగత వైయస్సార్ తనని ఆహ్వానిస్తేనే తాను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టు గుర్తు చేసారు. షర్మిళ రాజకీయ పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నారని, ఎంత ప్రయత్నం చేసినా తెలంగాణలో షర్మిళ పార్టీ ప్రభావం ఏమాత్రం ఉండదని జగ్గారెడ్డి కొట్టిపారేస్తున్నారు. షర్మిళ వర్సెస్ జగ్గారెడ్డి పరస్పర వ్యాఖ్యలతో రాజకీయం మాత్రం ఒక్కసారిగా వెడెక్కినట్టు తెలుస్తోంది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications