భట్టికి రాహుల్ అప్పగించిన టార్గెట్ ఏంటి..!?

రాహుల్ గాంధీ స్వయంగా తెలంగాణలో కాంగ్రెస్ పరిణామాల పై ఆరా తీస్తున్నారు. కర్ణాటక తరువాత తెలంగాణ పైన కాంగ్రెస్ అధికారం దక్కించుకోవాలనే కసితో అడుగులు వేస్తోంది. ఈ సమయంలో ఎక్కడ ఏ విషయంలోనూ ఉపేక్షించ కూడదని రాహుల్ నిర్ణయించినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా అభ్యర్దుల ఎంపికపై గతం కంటే భిన్నంగా వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఈ క్రమంలో సీఎల్పీ నేత భట్టికి అభ్యర్ధుల ఎంపిక పైన రాహుల్ కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ లో పెరుగుతున్న జోష్:ఖమ్మం సభ తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో జోష్ పెరిగింది. బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తమకు కలిసి వస్తాయని అంచనా వేస్తోంది. ఖమ్మం సభ తరువాత గన్నవరం బయల్దేరిన రాహుల్ తనతో పాటుగా భట్టిని వెంట బెట్టుకెళ్లారు.

Rahul Gandhi seek Report from Bhatti Vikramarka on Candidate selection ahead Assembly Elections

ఆ సమయంలో రాష్ట్రంలో పార్టీలోని పరిస్థితులపైన ఆరా తీసారు. నేతల సమన్వయంపైన చర్చించారని తెలుస్తోంది. భట్టికి పార్టీ వ్యూహాల పైన కీలక సూచనలు చేసారు. ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక కీలకం కావటంతో వీటి పైన భట్టి అభిప్రాయాలను కోరినట్లు సమాచారం. పార్టీలో నెలకొన్న పరిస్థితులను వివరించిన భట్టి.. టికెట్ల ఖరారు ఎంపిక పైన తన అభిప్రాయాలను వివరించారని తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా..సామాజిక వర్గాల సమీకరణాలు దెబ్బ తినకుండా పూర్తి అంచనాలతో నివేదిక కోరినట్లు విశ్వసనీయ సమాచారం.

భట్టికి రాహుల్ సూచనలు:అభ్యర్ధులను సూచించే క్రమంలో తీసుకోవాల్సిన అంశాలను స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. అభ్యర్థి ఎవరైనా గెలుపే ప్రామాణికం కావాలని భట్టి, రాహుల్ మంతనాల్లో నిర్ణయించారు. మొత్తం నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిస్థితులు..

Rahul Gandhi seek Report from Bhatti Vikramarka on Candidate selection ahead Assembly Elections

అభ్యర్థుల ఎంపికలో ఆయా నియోజకవర్గాల్లో తీసుకోవాల్సిన అంశాల పైన నివేదిక కోరినట్లు సమాచారం. దీంతో, భట్టికి రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించారని పార్టీలో చర్చ జరుగుతోంది.ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో టికెట్లు ఖరారు చేయటం వలన ప్రతీ సారి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సారి ఎన్నికలకు ముందుగానే క్లారిటీ ఉన్న నియోజకవర్గాల్లో వచ్చే నెలలోనే టికెట్లు ఖరారు చేసే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.

తొలి జాబితా పై కసరత్తు:పోటీ ఉన్న నియోజకవర్గాల్లోనూ అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఎన్నికలకు మూడు నెలల ముందుగానే విడదుల చేసేందుకు రాహుల్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. దీని ద్వారా చివరి నిమిషం లో సీట్ల కోసం వివాదాలు నివారించవచ్చని, అభ్యర్థుల ప్రచారానికి సమయం ఎక్కువగా ఇచ్చినట్లవుతుందని భావిస్తున్నారు.

ఈ సమయంలో భట్టి నుంచి రాహుల్ నివేదిక కోరటంతో అభ్యర్థుల ఎంపికలో భట్టి విక్రమార్క్ చేసే సూచనలు, ఇచ్చే నివేదిక పార్టీ అభ్యర్థుల ఖరారులో కీలకంగా మారనుందని పార్టీలో ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ వచ్చే నెలలో తొలి జాబితా విడుదలకు సిద్దం అవుతోంది. కాంగ్రెస్ కూడా తొలి జాబితాను త్వరగా విడుదల చేయాలని భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+