చర్లపల్లి నుంచి చెన్నైకు ప్రత్యేక రైళ్లు: ఆగే స్టేషన్లు, టైమింగ్స్..!!

రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి రద్దీ వేళ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి నుంచి చెన్నైకు ఈ రైళ్లు నడవనున్నాయి. రెగ్యులర్ రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్టు పెరగటంతో పండుగ ప్రయాణీకుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు ఇరు మార్గాల్లోనూ తెలంగాణ, ఏపీలోని ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు తెలిపారు
ఈ రైళ్లు ప్రయాణంచే రూట్ తో పాటుగా టైమింగ్స్ ను ప్రకటించారు.

పూజా ఫెస్టివల్‌ను పురస్కరించుకొని చర్లపల్లి-చెన్నై మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 6, 7 తేదీల్లో ఈ పండుగ ప్రత్యేక రైళ్లు ప్రయాణీకుల కు అందుబాట్‌లో ఉంటాయి. 07059 చర్లపల్లి - చెన్నై సెంట్రల్ రైలు 06.11.2026 రాత్రి 9:30 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 11:15 గంటలకు చెన్నై చేరుకుంటుంది. 07060 చెన్నై సెంట్రల్ - చర్లపల్లి ట్రైన్ 07.11.2026న మధ్యాహ్నం 12:40 గంటలకు చెన్నై నుంచి బయల్దేరి.. మరుసటి రోజు తెల్లవారుజామున 04:30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. నల్గొండ, మిర్యాలగూడ, ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరులో ఆగుతుంది. ఈ పూజా ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులకు అనువుగా స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను అందుబాటులో ఉంచారు.

 ముగిసిన టీటీడీ ఛైర్మన్ పదవీ కాలం- పాలనా బాధ్యతలు వారికి కేటాయింపు, ఉత్తర్వులు..!!
ముగిసిన టీటీడీ ఛైర్మన్ పదవీ కాలం- పాలనా బాధ్యతలు వారికి కేటాయింపు, ఉత్తర్వులు..!!
railways-announce-special-trains-between-cherlapalli-chennai-during-diwali-rush-schedule-here

దీపావళి రద్దీ వేళ ప్రత్యేక రైళ్లు

కాగా, ఇప్పటికే దీపావళి కోసం దక్షిణ మధ్య రైల్వే మొత్తం 22 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చెన్నై సెంట్రల్, కోయంబత్తూరులోని పోదనూర్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చెన్నై సెంట్రల్-పోదనూర్ స్పెషల్ (06023) రైలు నవంబర్ 6వ తేదీ రాత్రి 11:55 గంటలకు చెన్నై సెంట్రల్ నుండి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9:15 గంటలకు కోయంబత్తూరులోని పోదనూర్ జంక్షన్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో పోదనూర్-చెన్నై సెంట్రల్ స్పెషల్ (06024) నవంబర్ 9వ తేదీ రాత్రి 11:30 గంటలకు పోదనూర్ నుండి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9:35 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లను పెరంబూర్, తిరువళ్లూరు, అరక్కోణం, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్ మీదుగా నడుపుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+